షార్ట్‌ సర్క్యూట్‌తో పంటలు దగ్ధం | - | Sakshi
Sakshi News home page

షార్ట్‌ సర్క్యూట్‌తో పంటలు దగ్ధం

May 2 2026 8:20 AM | Updated on May 2 2026 8:20 AM

బోథ్‌: మండలంలోని కౌఠ (బి) గ్రామ శివారులో విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ఓ రైతు పండించిన జొన్న పంట పూర్తిగా అగ్నికి ఆహూతైంది. సాకె ర గ్రామ శివారు వద్ద ముడుపు సతీశ్‌రెడ్డి అనే రైతు కు చెందిన జొన్న చేనులో ఉదయం ఒక్కసారిగా వి ద్యుత్‌ తీగలు ఒకదానికొకటి తగిలి మంటలు చెలరేగాయి. ఎండల తీవ్రత ఎక్కువగా ఉండగా మంట లు వేగంగా వ్యాపించి సుమారు ఎకరం విస్తీర్ణంలో ని జొన్నపంట పూర్తిగా కాలి బూడిదైంది. చేతికి వ స్తుందనుకున్న పంట కళ్ల ముందే కాలిపోవడంతో సతీశ్‌రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తంచేశాడు. షార్ట్‌సర్క్యూ ట్‌ కారణంగా పంట నష్టపోయిన తనను ప్రభుత్వం పరిహారంతో ఆదుకోవాలని కోరుతున్నాడు.

చందునాయక్‌ తండాలో మొక్కజొన్న..

ఖానాపూర్‌: మండలంలోని చందునాయక్‌ తండా గ్రామానికి చెందిన గిరిజన రైతు గుగ్లావత్‌ సురేశ్‌ నాయక్‌ మొక్కజొన్న చేను విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌తో దగ్ధమైంది. గ్రామ శివారులోని పంటచేలలో ఒ క్కసారిగా మంటలు చెలరేగి రెండెకరాల మొక్కజొ న్న పూర్తిగా దగ్ధమైనట్లు బాధిత రైతు ఆవేదన వ్య క్తం చేశాడు. చేతికందిన పంట దగ్ధం కావడంతో తీ వ్ర ఆవేదనకు గురయ్యాడు. తనకు పరిహారం అందించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాడు.

భూతాయ (బి) గ్రామంలో..

బజార్‌హత్నూర్‌: మండలంలోని భూతాయ (బి) గ్రామంలో షార్ట్‌ సర్క్యూట్‌తో రెండెకరాల్లోని మొ క్కజొన్న పంట దగ్ధమైంది. గ్రామస్తులు తెలిపిన వి వరాల ప్రకారం.. కాల్బూర్గే మారుతికి చెందిన మొ క్కజొన్న చేనుపై నుంచి వెళ్తున్న విద్యుత్‌ తీగలు గా లికి ఒకదానికొకటి తగిలాయి. దీంతో నిప్పురవ్వలు ఎగిసి పడి రెండెకరాల పంట కాలి బూడిదైంది. సుమారు రూ.లక్ష వరకు నష్టం జరిగింది.

ప్రమాదవశాత్తు మామిడి తోట..

తాండూర్‌: మండలంలోని చౌటపల్లి శివారులో ప్ర మాదవశాత్తు నిప్పంటుకుని మామిడితోట దగ్ధమైంది. బాధిత రైతు ఈస తెలిపిన వివరాల ప్రకారం.. చౌటపల్లి శివారులోని బాధిత రైతు రెండెకరాల మా మిడి తోట నుంచి సోలార్‌ ప్లాంట్‌ విద్యుత్‌ లైన్‌ వె ళ్లింది. శుక్రవారం షార్ట్‌సర్క్యూట్‌తో మంటలు చెలరేగి మామిడితోట దగ్ధమైంది. పంట చేతికి వచ్చే సమయంలో సుమారు మామిడి 200 చెట్లు, 145 టేకు చెట్లు అగ్నికి ఆహూతి కాగా తీవ్ర నష్టం వాటిల్లింది. ఘటనపై విచారణ జరిపించి తనకు న్యాయం చేయాలని బాధిత రైతు కోరుతున్నాడు.

అల్లీపూర్‌లోమొక్కజొన్న చేను..

దండేపల్లి: మండలంలోని అల్లీపూర్‌ గ్రామానికి చెందిన ఈర్ల సత్తయ్య మొక్కజొన్న చేను శుక్రవారం ప్రమాదవశాత్తు కాలిపోయింది. సుమారు పదెకరా ల మొక్కజొన్నతోపాటు నీటి పైపులు కాలిపోయా యి. మంటలు చెలరేగిన వెంటనే జన్నారం ఫైర్‌స్టేషన్‌కు సమాచారం ఇవ్వగా, అగ్నిమాపక యంత్రం వచ్చి మంటలు ఆర్పివేసింది. తనను ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత రైతు కోరుతున్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement