బాలరాముడి చెంతకు భక్తుడి పాదయాత్ర | - | Sakshi
Sakshi News home page

బాలరాముడి చెంతకు భక్తుడి పాదయాత్ర

May 2 2026 8:20 AM | Updated on May 2 2026 8:20 AM

● వెయ్యి కిలోమీటర్లు నడిచి అయోధ్యకు చేరిన నవీన్‌కుమార్‌

తాండూర్‌: శ్రీరామ జన్మభూమి అయిన అయోధ్యపురిని సందర్శించి బాలరాముడిని దర్శించుకోవాలనే ఆ భక్తుడి కోరిక నెరవేరింది. వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసి తన ఇష్టదైవం చెంతకు చేరి తన భక్తిని చాటుకున్నాడు తాండూర్‌ మండలం చౌటపల్లి గ్రా మానికి చెందిన చీమల నవీన్‌కుమార్‌. గత మార్చి 10వ తేదీన నవీన్‌కుమార్‌ ఆంజనేయస్వామి మాల ధరించాడు. గ్రామంలోని ఆలయంలో పూజలు చేసి 11వ తేదీన అయోధ్యకు మహాపాదయాత్ర ప్రారంభించాడు. 52రోజుల్లో వెయ్యి కిలోమీటర్లు పాదయాత్ర చేసి శుక్రవారం అయోధ్యకు చేరి బాలరాముడిని దర్శించుకున్నాడు. ఈ సందర్భంగా నవీన్‌కుమార్‌ మాట్లాడుతూ.. మహాపాదయాత్ర చేసి శ్రీరామచంద్రుడిని దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నాడు. తన పాదయాత్రకు సహకరించిన భక్తకోటికి శిరస్సు వంచి నమస్కారాలు తెలిపాడు.

Advertisement
 
Advertisement
Advertisement