ఎస్పీని సన్మానించిన బాధిత కుటుంబం | - | Sakshi
Sakshi News home page

ఎస్పీని సన్మానించిన బాధిత కుటుంబం

May 2 2026 8:20 AM | Updated on May 2 2026 8:20 AM

● నిందితులకు శిక్ష పడడంతో సిద్దిపేట నుంచి వచ్చి సత్కారం

ఆదిలాబాద్‌టౌన్‌: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ముస్తాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో 2020 డిసెంబర్‌ 27న భూ వివాదంలో ఓ వ్యక్తిని నలుగురు హత్య చేశారు. రాజన్న సిరిసిల్ల ఎస్పీగా అఖిల్‌ మహాజన్‌ పనిచేసిన సమయంలో కేసును పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి నిందితులకు శిక్ష పడేలా కోర్టులో చార్జిషీట్‌ దాఖలు చేయించారు. ఇటీవల నిందితులకు కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. బాధిత కుటుంబ సభ్యులు తమకు న్యాయం జరిగిందని సంతోషం వ్యక్తం చేశారు. మృతుడి అన్న భూమ్‌రెడ్డి సిద్దిపేట నుంచి శుక్రవారం ఆదిలాబాద్‌ పట్టణానికి చేరుకున్నారు. జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. స్వీట్లు తినిపించి అభినందనలు తెలిపారు. తమకు న్యాయం జరిగిందని సంతోషం వ్యక్తం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement