తలమడుగు: రైతులు పండించిన పంటలకు బీమా కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. బుధవారం మండలంలోని దేవాపూర్, భరంపూర్ గ్రామాల్లో జొన్నపంటలు దగ్ధమైన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే గ్రామానికి వెళ్లి పరిశీలించారు. దేవాపూర్‌లో రైతు అజీస్ పటేల్ దగ్ధమైన జొన్న పంటను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆరెకరాల్లో రూ.6 లక్షల పంట నష్టం వాటిల్లిందని బాధిత రైతు వాపోయాడు. అధైర్య పడవద్దని, ప్రభుత్వం తరపున పరిహారం వచ్చేలా చూస్తానని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఫసల్ భీమా పథకం అమలు చేసి రైతులను ఆదుకోవాలన్నారు. అనంతరం బరంపూర్‌లో రైతు మోహన్, ఆశన్నను పరామర్శించి వివరాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో దేవాపూర్ సర్పంచ్ సంతోష్, మాజీ సర్పంచ్ అబ్దుల్లా, మండల కన్వీనర్ తోట వెంకటేష్, అధికార ప్రతినిధి కిరణ్ కుమార్, కేదేరేశ్వర్ రెడ్డి, అభిరామ్‌రెడ్డి, మాడూరి రమాకాంత్, బరంపూర్ ఉపసర్పంచ్ రంజిత్‌రెడ్డి, తోట శ్రీనివాస్, ఉపాధ్యక్షులు ప్రకాష్, తదితరులు పాల్గొన్నారు.


