ఖానాపూర్: ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై రాహుల్ గైక్వాడ్ తెలిపిన వివరాల మేరకు మండలంలోని సత్తెనపల్లి గ్రామానికి చెందిన భూక్య రాజేశ్వర్ కుమారుడు భూక్య ఆకాష్ (18) ఖా నాపూర్‌లోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ చదువుతున్నాడు. ఇటీవల కంప్యూటర్ శిక్షణ కోసం హైదరాబాద్‌కు వెళ్లి ఆదివారం మధ్యాహ్నం ఇంటికి వాచ్చడు. ఖాళీ సమయంలో డీజే ఆపరేటింగ్ చేసే విద్యార్థి అదే రోజు మధ్యాహ్నం డీజే పనికి వెళ్లి రాత్రి ఇంటికి వచ్చి భోజనం చేసి పడుకున్నాడు. సోమవారం ఉదయం గది తలుపు తీయకపోవడంతో కుటుంబ సభ్యులు కిటికీ ద్వారా చూడగా టవల్‌తో ఉరేసుకుని కనిపించాడు. డీజే వద్ద జరిగిన గొడవలో కొందరు వ్యక్తులు ఆకాష్‌పై దాడి చేసినట్లు తె లిసింది. అలాగే ఇంటర్ ఫలితాల్లో ఫెయిల్ కావడంతో మనస్తాపానికి గురై ఉండవచ్చని భావిస్తున్నా రు. ఈ కారణాలతో ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని మృతుని తండ్రి రాజేశ్వర్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.
నర్సాపూర్(జి) మండలంలో ..
నర్సాపూర్(జి): పరీక్షల్లో ఫెయిల్ అయ్యానని మనస్తాపంతో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. గొల్ల మాడకు చెందిన గొల్ల శివాజీ, రజిత కుమారుడు మణివర్ధన్(17) నిర్మల్‌లోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఆదివారం వెలువడిన ఫలితాల్లో ఫెయిల్ కావడంతో మనస్తాపం చెందాడు. సోమవారం మధ్యాహ్నం గ్రామ శివారులోని లొద్దిగుట్ట ప్రాంతంలో చెట్టుకు ఉరేసుకున్నాడు. గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులు, పోలీసులకు సమాచారం అందించారు. మృతుని తండ్రి శివాజీ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గణేశ్ తెలిపారు.
మద్యానికి బానిసై ఒకరు..
తాంసి: మద్యానికి బానిసై వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు వామన్‌నగర్ గ్రామానికి చెందిన మడావి శ్రీరామ్ (63) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ కమ్రంలో కొన్నేళ్లుగా మద్యానికి బానిసయ్యాడు. ఈ నెల 9న మద్యం మత్తులో ఇంటి వద్ద పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబసభ్యులు రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స అందిస్తుండగా మధ్యలోనే తిరిగి ఇంటికి వచ్చాడు. పరిస్థితి విషమించి ఆదివారం రాత్రి మృతి చెందాడు. మృతుని భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు సోమవారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై జీవన్‌రెడ్డి తెలిపారు.
సంతానం కలగడం లేదని ఒకరు ..
తాంసి: పురుగుల మందు తాగి ఒకరు ఆత్మహత్య చేసుకున్న ఘటన భీంపూర్ మండలంలోని కరన్‌వాడీలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గుబిడి గ్రామానికి చెందిన మడావి రాజు (39), లక్ష్మీబాయి దంపతులు వ్యవసాయ కూలీలుగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. వివాహమై ఇరవై ఏళ్లు కావస్తున్నా సంతానం కలగడం లేదని మనస్తాపానికి గురైన రాజు మద్యానికి బానిసయ్యాడు. ఈక్రమంలో ఈనెల 9న మద్యం మత్తులో గ్రామ సమీపంలో పురుగుల మందు తాగాడు. విషయం గ్రామస్తులకు చెప్పడంతో రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రణయ్ కుమార్ తెలిపారు.
పురుగుల మందు తాగి యువకుడు..
కాసిపేట: పురుగుల మందు తాగి యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై గంగారాం తెలిపిన వివరాల మే రకు రొట్టపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని సుంగుపంతులుగూడకు చెందిన సూర్పం కార్తీక్ (18)వెంకటాపూర్‌కు చెందిన యువతిని కొంతకాలంగా ప్రేమిస్తున్నట్లు తెలిసింది. ఆదివారం బంధువుల ఇంట్లో జరిగిన పెళ్లిలో కార్తీక్ తన స్నేహితులైన ఆత్రం వినోద్, చిక్రం మధుకర్‌తో కలిసి మద్యం సేవిస్తూ తాను ప్రేమించిన అమ్మాయి తనతో మాట్లాడడంలేదని చెప్పుకుంటూ బాధపడ్డాడు. రాత్రి ఇంటి వెనుకాల ఉన్న పెరట్లో గుర్తు తెలియని పురుగుల మందు తాగి గట్టిగా అరవడంతో కుటుంబ సభ్యులు ఆటోలో మంచిర్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం చెందాడు. ప్రేమించిన అమ్మాయి తిరస్కరించిందన్న బాధతో తమ కుమారుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడని మృతుని తండ్రి రామకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
ఒకరి హత్య
నిజామాబాద్‌అర్బన్: ఆదిలాబాద్ జిల్లాకు చెందిన వ్యక్తి నిజామాబాద్‌లో హత్యకు గురైనట్లు 4వ టౌన్ ఎస్సై సందీప్ సోమవారం తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మోహన్ (40) వినాయక్‌నగర్‌లో ఉంటూ మేసీ్త్ర పని చేస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన బద్ద సౌందర్యతో ఎనిమిదేళ్లుగా సహజీవనం చేస్తున్నాడు. ఈ నెల 12న తెల్లవారుజామున సదరు మహిళ మోహన్ మెడకు చీర బిగించి ఊపిరి ఆడకుండా చేసి హత్య చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, మృతుని కుటుంబానికి సంబంధించిన వివరాలు తెలియడం లేదన్నారు. సంబంధీకులు ఎవరైనా ఉంటే 87126 59840 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.


