సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి
జైపూర్: మండల కేంద్రంలో గల సింగరేణి థర్మల్ పవర్ ప్లాంటులో గల అడ్మిన్ భవన కార్యాలయంలో శుక్రవారం సైబర్ మోసాలపై ఉద్యోగులకు అవగాహన కల్పించారు. ఎస్టీపీపీ ఈడీ చిరంజీవి, జీఎంలు నర్సింహారావు, మదన్‌మోహన్‌ల అధ్యక్షతన అధికారులు, ఉద్యోగులకు ఐడీ డీజీఎంలు శ్రీనివాస్‌రావు, నానా ఫర్ణవీస్‌లు పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఆధార్, బ్యాంకు, ఇతర ముఖ్యమైన నంబర్లను సోషల్‌మీడియాలో ఎవరితోనూ పంచుకోవద్దన్నారు. అంతకుముందు ఎస్టీపీపీలో జాతీయ ఐక్యత దినోత్సవం ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా వల్లాభాయ్ పటేల్ 150వ జయంతి నిర్వహించారు. పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.


