తాళం వేసిన ఇంట్లో చోరీ
దస్తురాబాద్: తాళం వేసిన ఇంట్లో దొంగతనం జరిగిన ఘటన మండలంలోని రేవోజీపేట గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సై సాయికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. రేవోజీపేట గ్రామానికి చెందిన ముప్పిడి రాధ అనే వివాహిత తన కూతూరు నిత్యతో కలిసి అక్టోబర్ 27న కరీంనగర్‌లోని బంధువుల ఇంటికి వెళ్లింది. 30న ఇంటికి తిరిగి వచ్చే సరికి ఇంట్లోని బీరువాను గుర్తుతెలి యని వ్యక్తులు పగులగొట్టి 5తులాల వెండి, తులం బంగారు కమ్మలు, అర్ధతులం చైను దొంగిలించారు. బాధితురాలి ఫిర్యాదుతో శుక్రవారం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


