ఉరేసుకుని యువకుడు ఆత్మహత్య
సారంగపూర్: మండలంలోని జామ్ గ్రామానికి చెందిన రసూల్ సాయి(26) అనే యువకుడు జీవితంపై విరక్తి చెంది ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. సాయి చిన్నతనంలోనే తల్లి మృతి చెందగా తన ఆలనాపాలన తాత, నానమ్మలు ఆశన్న –ఆశమ్మలు చూసుకునేవారు. తండ్రి ప్రకాశ్ వద్దకు వెళ్లకుండా వీళ్ల వద్దే ఉండేవాడు. ఈనేపథ్యంలో మద్యానికి బానిసై డబ్బులకోసం వారిని వేధిస్తూ కొట్టేవాడు. బాధ భరించలేక సాయి నానమ్మ, తాతయ్యలు సాయికి దూరంగా వేరే ఇళ్లు అద్దె కు తీసుకుని ఉంటున్నారు. ఈక్రమంలో అతిగా మద్యం సేవించి మద్యం మత్తులో జీవితంపై విరక్తి చెంది శుక్రవారం ఇంట్లో ఉరేసుకుని మృతిచెందాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిర్మల్ ఏరియా ఆసుపత్రికి తరలించారు.


