గోదావరిలో పడి వృద్ధుడు..
లోకేశ్వరం: మండలంలోని అబ్ధుల్లాపూర్ గ్రామానికి చెందిన దుందు చిన్న భోజన్న (65) అనే మతిస్థిమితం లేని వృద్ధుడు గోదావరిలో పడి మృతి చెందాడు. లోకేశ్వరం ఎస్సై అశోక్ తెలిపిన వివరాలు.. దుందు భోజన్నకు మతిస్థిమితం లేదు. ఈనెల 23 నుంచి కన్పించడం లేదు. కుటుంబ సభ్యులు ఫి ర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. శుక్రవారం పాత అబ్ధుల్లాపూర్ గ్రామ శివారు ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్‌లో శవమై కన్పించాడు. మృతదేహం కుళ్లిపోవడంతో భైంసా ఆస్పత్రి వైద్యులు సంఘటన స్థలంలోనే పంచనామా నిర్వహించారు. కాగా భార్య రుక్మవ్వ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.


