కళాకార్ సంఘ్ ప్రధాన కార్యదర్శిగా శ్రీనివాస్
జైపూర్: మంచిర్యాల జిల్లాకు చెందిన ప్రముఖ చిత్రకారుడు, చిప్పకుర్తి ఆర్ట్స్ అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఉపాధ్యాయుడు చిప్పకుర్తి శ్రీనివాస్ చిత్రకారుల సంస్థ భారతీయ కళాకార్ సంఘ్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అక్టోబర్ 28, 29 తేదీల్లో జరిగిన భారతీయ కళాకార్ సంఘ్ జాతీయ సమావేశాల్లో ఆయనకు నియామకపత్రాన్ని అందజేశారు. సమావేశంలో సంస్థ వ్యవస్థాపకుడు అంకూర్, జాతీయ అధ్యక్షుడు కుమార్, యూపీ అధ్యక్షుడు పాలన్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రాము పాల్గొన్నారు.


