చికిత్స పొందుతూ వృద్ధురాలు మృతి
కాసిపేట: మండలంలోని రొట్టెపల్లికి చెందిన పోగు ల పోసు(70) అనే వృద్ధురాలు ఆత్మహత్యకు పాల్పడగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందినట్లు దువాపూర్ ఎస్సై గంగారాం తెలిపారు. ఎస్సై, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం మల్కేపల్లి ఆశ్రమ పాఠశాలలో స్వీపర్‌గా పనిచేసే పోసుకు ఐదు నెలల క్రితం కిడ్నీలలో రాళ్లు రావడంతో అపరేషన్ చేశారు. అనంతరం ఆరోగ్యం క్షీణించడంతో జీ వితంపై విరక్తి చెంది గురువారం సాయంత్రం మద్యం మత్తులో ఇంట్లోని గడ్డి మందు తాగింది. ఆమె కుమారుడు పోగుల శంకర్ కాసిపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి, పరిస్థితి విషమించడంతో మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించాడు. అక్కడే చికిత్స పొందుతూ శుక్రవారం ఉద యం మృతిచెందింది. శంకర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.


