 
															ఉద్యోగాల కల్పన కోసమే జాబ్‌మేళా
బెల్లంపల్లి: నిరుద్యోగులకు ఉద్యోగావకాశాల కల్పన కోసమే బెల్లంపల్లిలో ఈనెల 26న మెగా జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, సింగరేణి సీఎండీ ఎన్.బలరాం నాయక్ తెలిపారు. గురువారం హైదరాబాద్ సింగరేణి భవన్‌లో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుతో కలిసి జాబ్‌మేళా ప్రచార వాల్ పోస్టర్ ఆవిష్కరించారు. 80కి పైగా ప్రైవేట్ కంపెనీలు రానున్నట్లు, విద్యార్హతలకు అనుగుణంగా ఉద్యోగావకాశాలు ఉంటాయన్నారు. ఈ అవకాశాన్ని బెల్లంపల్లి ప్రాంత నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో జీఎం (కోఆర్డినేషన్, మార్కెటింగ్ ) టి. శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
బెల్లంపల్లి ఏఎంసీ గ్రౌండ్‌లో..
బెల్లంపల్లి సింగరేణి ఏఎంసీ క్రీడా మైదానంలో గురువారం మందమర్రి ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ ఎన్.రాధాకృష్ణ ఆధ్వర్యంలో మెగా జాబ్‌మేళా వాల్ పోస్టర్ ఆవిష్కరించారు. జీఎం మాట్లాడుతూ.. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి నిరుద్యోగులు జాబ్‌మేళాలో పాల్గొనేందుకు పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఓటు జీఎం విజయ ప్రసాద్, ఏఐటీయూసీ బెల్లంపల్లి బ్రాంచ్ కార్యదర్శి దాగం మల్లేష్, పర్సనల్ మేనేజర్ శ్యాంసుందర్, రమేశ్, రాము, శంకర్, చిప్ప నర్సయ్య, తదితరులు పాల్గొన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
