 
															నేడు ఉమ్మడి జిల్లా క్రికెట్ ఎంపిక పోటీలు
మంచిర్యాలఅర్బన్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్ –19 బాలబాలికల క్రికెట్ పోటీలు ఈనెల 23న నిర్మల్ జిల్లా కేంద్రంలోని లక్కీ అకాడమీలో నిర్వహిస్తున్నట్లు ఎస్‌జీఎఫ్ అండర్ –19 సెక్రెటరీ బాబురావు తెలిపారు. పూర్తి వివరాలకు కోచ్ సుదర్శన్‌ను సంప్రదించాలన్నారు.
రేపు అథ్లెటిక్ పోటీలు..
ఈనెల 24న ఎస్‌జీఎఫ్ అండర్ –19, జిల్లా స్థాయి, ఉమ్మడి జిల్లాస్థాయి అథ్లెటిక్ పోటీలు లక్సెట్టిపేట మహాత్మ జ్యోతిబాపూలే స్కూల్, క ళాశాలలో నిర్వహిస్తున్నట్లు బాబురావు తెలపారు. కళాశాల నుంచి ఒక ఈవెంట్‌లో ఒక వి ద్యార్థి మాత్రమే పాల్గొనాలని సూచించారు. పూర్తి వివరాలకు పీఈటీలు నాంపల్లి(బాలురు), రమా(బాలికలు)లను సంప్రదించాలన్నారు.
రేపు ఉమ్మడి జిల్లా ఎన్‌ఎస్‌ఎస్ సమావేశం
మంచిర్యాలఅర్బన్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జాతీయ సేవా పథకం (ఎన్‌ఎస్‌ఎస్) సమావేశం ఈనెల 24న మంచిర్యాల వివేకవర్ధిని డిగ్రీ కళాశాలలో నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్‌ఎస్‌ఎస్ కన్వీనర్ ఉదారి చంద్రమోహన్‌గౌడ్ తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జూనియర్, డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాళ్లు, ఎన్‌ఎస్‌ఎస్ పథకం ప్రోగ్రాం అధికారులు సమావేశానికి హాజరుకావాలని సూచించారు. 2024 –25 సంవత్సరానికి రెగ్యులర్ ఆక్టివిస్, స్పెషల్ క్యాంపులకు సంబంధించిన రిపోర్టు తీసుకురావాలన్నారు. 2025 –26 సంవత్సరానికి యాక్షన్‌ప్లాన్, వలంటీర్స్ డాటా సైతం తీసుకురావాలని సూచించారు.
పులి సంచారం
కాగజ్‌నగర్‌రూరల్: కాగజ్‌నగర్ మండలం రాస్పెల్లి పరిధిలోని గెర్రెగూడ గ్రామ సమీపంలో బుధవారం పులి సంచరించడంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. గెర్రెగూడ గ్రామం నుంచి అటవీ ప్రాంతానికి వెళ్లే దారిలో పులి అడుగులను స్థానికులు గుర్తించి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న అధికారులు పాదముద్రలు సేకరించారు. పులిజాడను గుర్తించేందుకు అధికారులు సీసీ కెమెరాలు అమర్చారు. పులి రాస్పెల్లి బీట్ పరిధిలో సంచరిస్తుండడంతో డప్పు చాటింపు ద్వారా ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
