
‘9న సమావేశం విజయవంతం చేయాలి’
పాతమంచిర్యాల: మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి మండల కేంద్రంలో ఈ నెల 9న నిర్వహించే తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, జగిత్యాల జిల్లాల కార్యకర్తల సమావేశాన్ని విజయవంతం చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు దుర్గం నూతన్ కుమార్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని సీపీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి కనికరపు అశోక్, నిర్మల్ జిల్లా అధ్యక్షుడు తిరుపతి, నాయకులు శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.