
సమస్యలు తెలుసుకునేందుకే ‘మార్నింగ్ వాక్’
జన్నారం: సమస్యలు తెలుసుకునేందుకే ‘పొద్దుపొడుపు–బొజ్జన్న అడుగు’ (మార్నింగ్ వాక్) కార్యక్ర మం నిర్వహిస్తున్నట్లు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ తెలిపారు. కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఉదయం మండలంలోని పొనకల్ గాంధీనగర్‌కు వెళ్లారు. గ్రామస్తులు రోడ్లు, డ్రైనేజీల సమస్యలు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని కోరారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడు తూ.. ఇళ్లు రాని అర్హులకు మరో విడతలో మంజూ రు చేస్తామని చెప్పారు. ఇక నుంచి ప్రతీ నెల ఒక మండలాన్ని ఎంచుకుని దినమంతా ఒక గ్రామాన్ని పర్యటించి సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తానని చెప్పారు. ఏడాదిలో సమస్యలు లేని గ్రామాలుగా చూడడమే తన లక్ష్యమని తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజాసమస్యలు గుర్తించి తెలిపితే పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండలాధ్యక్షుడు ముజా ఫర్ అలీఖాన్, మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మీనారా యణ, నాయకులు మోహన్‌రెడ్డి, ఇసాక్, ఇంద య్య, సుధీర్ తదితరులు పాల్గొన్నారు.