
పక్కాగా పోషకాహారం
● అంగన్‌వాడీల్లో ఫేస్ రికగ్నిషన్ ● జూలై 1నుంచి అమలుకు చర్యలు ● అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకే..
మంచిర్యాలటౌన్: అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా లబ్ధిదారులకు అందించే పౌష్టికాహారం పక్కదారి పట్టకుండా ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపడుతోంది. వచ్చే నెల 1వ తేదీ నుంచి ఫేషియల్ రికగ్నిషన్ (ఎఫ్‌ఆర్‌ఎస్) విధానాన్ని అమలు చేసేందుకు చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా ఇప్పటికే లబ్ధిదారుల ముఖచిత్రాలు ఆన్‌లైన్‌లో అప్ లోడ్ చేశారు. జూలై 1నుంచి ఫేషియల్ రికగ్నిషన్ విధానం ద్వారా లబ్ధిదారులకు పౌష్టికాహారం అందించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. లబ్ధిదారులకు అందించే పౌష్టికాహారం పంపిణీలో అక్రమాలు చోటు చేసుకుంటున్నట్లు ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలోనే ఈ విధానాన్ని ప్రభుత్వం అమలులోకి తెచ్చింది. ఇప్పటికే అంగన్‌వాడీ టీచర్లకు ఇచ్చిన ఫోన్లలో పోషణ్ ట్రాకర్ యాప్ ద్వారా ముఖ గుర్తింపు ప్రక్రియ అమలు చేసే విధానంపై అవగాహన కల్పించి పలు సూచనలు చేశారు.
పంపిణీలో పారదర్శకత కోసమే..
ప్రస్తుతం అంగన్‌వాడీ కేంద్రాల్లో ఆరు నెలల నుంచి మూడేళ్లలోపు చిన్నారుల ఇంటికే వెళ్లి బాలామృతం, గుడ్లు పంపిణీ చేస్తున్నారు. చిన్నారుల తల్లుల ము ఖచిత్రాలను యాప్‌లో నమోదు చేసుకుని సరుకులు అందిస్తున్నారు. వీరితో పాటు గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అందించే పౌష్టికాహా రానికి కూడా వచ్చే నెల నుంచి ముఖ గుర్తింపును తప్పనిసరి చేయనున్నారు. ఈ విధానం ద్వారా పౌష్టికాహారం పంపిణీలో అక్రమాలను నిరోధించవచ్చని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ భావిస్తోంది. జూలై 1వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని అంగన్‌వాడీ కేంద్రాల్లో దీనిని అమలు చేసేందుకు ఏ ర్పాట్లు చేస్తోంది. జిల్లావ్యాప్తంగా 969 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. వీటి పరిధిలో మూడేళ్లలోపు చి న్నారులు 21,394 మంది, మూడు నుంచి ఆరేళ్లలో పు చిన్నారులు 10,539 మంది, గర్భిణులు 3,528 మంది, బాలింతలు 3,381 మంది ఉన్నారు.
అమలుకు సిద్ధంగా ఉన్నాం
ఫేస్ రికగ్నిషన్ ద్వారా లబ్ధిదారుల ఇంటికే వెళ్లి సరుకులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికే పోషణ్ ట్రాక్ యాప్ ద్వారా లబ్ధిదారుల వివరాలు నమోదు చేశాం. ఈ విధానాన్ని అమలు చేస్తే నేరుగా లబ్ధిదారులకు పౌష్టికాహారం పంపిణీ చేసే అవకాశముంటుంది.
– రౌఫ్‌ఖాన్, జిల్లా సంక్షేమశాఖ అధికారి
జిల్లాలోని అంగన్‌వాడీల సమాచారం
అంగన్‌వాడీ కేంద్రాలు 969
గర్భిణులు 3,528
బాలింతలు 3,381
మూడేళ్లలోపు చిన్నారులు 21,394
3–6 ఏళ్లలోపు చిన్నారులు 10,539

పక్కాగా పోషకాహారం