జువాలజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా లైఫ్ మెంబర్‌గా రా
జన్నారం: వివిధ రకాల పరిశోధనల ద్వారా అనేక అంశాలు గుర్తించడంలో చేసిన కృషికి మండలవాసికి జాతీయస్థాయి గుర్తింపు లభించింది. జన్నా రం మండలం మొర్రి గూడ గ్రామం ఎస్సీ కాలనీకి చెందిన ప్రముఖ పరిశోధకుడు డాక్టర్ రాకేశ్ దావెల్ల లక్నోలోని జువాలజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా లైఫ్ మెంబర్‌గా ఎంపికయ్యారు. జంతుశాస్త్ర పరిశోధనల్లో ఆయన చేసిన కృషికి గుర్తింపుగా ఈ గౌరవం లభించింది. ప్రస్తుతం ఆయన ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చరల్ యూనివర్సిటీలోని పెస్టిసైడ్ రెసిడ్యూస్ లేబొరేటరీలో రీసెర్చ్ అసోసియేట్‌గా సేవలు అందిస్తున్నారు. ఈ గుర్తింపు రావడం తనకు ఎంతో ఆనందంగా ఉందని, మరిన్ని పరిశోధనలు చేసి ప్రజలకు సేవలందించాలనే తన లక్ష్యమని తెలిపారు.


