
మున్సిపల్ ఎదుట బీఆర్‌ఎస్ ఆందోళన
చెన్నూర్: చెన్నూర్ మున్సిపల్ కమిషనర్ ము రళీకృష్ణ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తునారని ఆరోపిస్తూ గురువారం బీ ఆర్‌ఎస్ చెన్నూర్ నియోజకవర్గ ఇన్‌చార్జి రాజారమేశ్ ఆధ్వర్యంలో కార్యాలయం ఎదు ట బైఠాయించి ఆందోళన చేపట్టారు. ము న్సిపల్ కమిషనర్, ఎమ్మెల్యే వివేక్‌వెంకటస్వామిలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాజారమేశ్ మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలో కాంగ్రెస్ ఫ్లెక్సీలను తీయకుండా బీఆర్‌ఎస్ ఫ్లేక్సీలను తొలగించడం దారుణమని అన్నారు. అధికారిగా ఉంటూ ఏకపక్షంగా వ్యవహరించడం మంచి పద్ధతి కాదన్నారు. సీఐ దేవేందర్‌రావు సంఘటన స్థలానికి చేరుకొని ఏ పార్టీతో సంబంధం లేకుండా అన్ని ఫ్లెక్సీలు తొలగిస్తామని నచ్చజెప్పడంతో బీఆర్‌ఎస్ నాయకులు ఆందోళన విరమించారు. బీఆర్‌ఎస్ నాయకులు రాంలాల్‌గిల్డా, నవాజ్, కృష్ణ, రెవెల్లి మహేశ్, బాపు, తిరుపతి, సురేశ్‌రెడ్డి, జోడు శంకర్ పాల్గొన్నారు.