
అనారోగ్యంతో బాలింత..
కాసిపేట: అనారోగ్యంతో బాలింత మృతిచెందింది. మండలంలోని మల్కేపల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాలు.. మల్కేపల్లికి చెందిన పెరుగు రజిత(28), వెంకటేశ్ భార్యభర్తలు. పెళ్లయినప్పటి నుంచి రజిత సికిల్‌సెల్ వ్యాధితో బాధపడుతోంది. ఈనెల 8న కరీంనగర్‌లోని ప్రతిమ ఆస్పత్రిలో రెండో కాన్పులో ఆమె బిడ్డకు జన్మనిచ్చింది. వారం రోజులు ఆస్పత్రిలో చికిత్స అనంతరం ఇంటికి వచ్చింది. మూడు రోజుల క్రితం అనారోగ్యానికి గురైంది. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. సోమవారం చికిత్స పొందుతూ మృతిచెందింది. ఆస్పత్రిలో ఉండగానే మూడుసార్లు గుండెపోటు వచ్చినట్లు కుటుంబ సభ్యులు వైద్యులతో వాదనకు దిగినట్లు సమాచారం.