
గిరిజనుల సమస్యలు సత్వరం పరిష్కరించాలి●
ఉట్నూర్‌రూరల్: గిరిజనుల సమస్యలను సత్వరం పరిష్కరించాలని ఐటీడీఏ పీవో ఖుష్బూగుప్తా పేర్కొన్నారు. ఉట్నూర్ ఐటీడీఏ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో వివిధ ప్రాంతాల ప్రజలు తమ సమస్యలపై అర్జీలను ఖుష్బూ గుప్తా స్వీకరించారు. అర్జీలను శాఖల అధికారులు పరిశీలించి న్యాయం చేయాలన్నారు. పెంబి మండలం గుమ్మనా గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని టేకం భీంరావ్, తాండూర్ మండలం కిష్టంపేట గ్రామస్తులు తమ ఆర్‌వోఎఫ్‌ఆర్ పట్టాలు మంజూరు కల్పించాలని విన్నవించారు. కార్యక్రమంలో ఏపీవో మెస్రం మనోహర్, ఏవో దామోదర స్వామి, ఈఈ తానాజీ, పీహెచ్‌వో సందీప్, మేనేజర్ శ్యామల, డీపీవో ప్రవీణ్, జేడీఎం నాగభూషణం పాల్గొన్నారు.
పోలీసుల అదుపులో మైనర్ బాలుడు
ఆదిలాబాద్‌టౌన్: పట్టణంలోని ఓ కాలనీకి చెందిన 14 ఏళ్ల మైనర్ బాలుడు పదేళ్లలోపు ఇద్దరు బాలురు, ఒక బాలికను నిర్బంధించాడు. తన నివాసానికి తీసుకెళ్లి తలుపు పెట్టి నిర్బంధించినట్లు డీఎస్పీ ఎల్.జీవన్‌రెడ్డి తెలిపారు. ఆ ము గ్గురి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన మైనర్ బా లుడిని అదుపులో తీసుకుని సోమవారం జువైనెల్ కోర్టులో హాజరుపర్చినట్లు పేర్కొన్నారు. టూటౌన్ పోలీసుస్టేషన్‌లో కిడ్నాప్ కేసుతోపా టు అక్రమ నిర్బంధం, పోక్సో కేసు, అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు వివరించారు.