బెజ్జూర్: ఆటో ఢీకొని మహిళకు గాయాలైన సంఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు చిన్న సిద్దాపూర్‌కు చెందిన రెసే సత్యబాయి బుధవారం మండల కేంద్రంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌కు వచ్చి ఇంటికి వెళ్తున్న క్రమంలో మండల కేంద్రానికి చెందిన గోర ంట్ల రమేశ్ మద్యం మత్తులో ఆటో నడుపుతూ రో డ్డు దాటుతున్న సత్యబాయిని ఢీకొట్టాడు. తీవ్రగాయాలు కావడంతో స్థానికులు కాగజ్‌నగర్ ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడి నుంచి మెరుగైన వైద్యంకోసం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి కుమార్తె కొట్రంగి పావని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై ప్రవీణ్ కుమార్ తెలిపారు.
మద్యం మత్తే కారణం!
ఉదయం నుంచి మద్యం ఆటోలో పెట్టుకొని తా గుతూ జల్సాలు చేసినట్లు బాధిత మహిళ కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఘటన సమయంలో ఆటోలో 6 మద్యం సీసాలు, పల్లీలు, గ్లాసులు ఉన్నాయన్నారు. పెట్రోల్ బంక్ వద్ద ఆటోలో డెక్ పెట్టుకుని డ్యాన్సులు సైతం చేసినట్లు సమాచారం.
ఆటోలో 6 మద్యం సీసాలు లభ్యం
మద్యం మత్తే కారణమంటున్న బాధిత కుటుంబ సభ్యులు
ఆటో ఢీకొని మహిళకు గాయాలు