లక్ష్మణచాంద: రోడ్డు ప్రమాదంలో ఇరువురికి గాయాలైన సంఘటన మండలంలోని కనకాపూర్ జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన ఖాదీర్, కుభీర్ మండలానికి చెందిన సత్యనారాయణ మంగళవారం రాత్రి ద్విచక్ర వాహనంపై ఖానాపూర్ వైపు నుండి నిర్మల్ వెళ్తుండగా నిర్మల్ నుండి కనకాపూర్ వైపు వస్తున్న ట్రాక్టర్ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఘటనలో ఖాదీర్, సత్యనారాయణకు తీవ్ర గాయాలు కావడంతో నిర్మల్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు