● లక్సెట్టిపేట కళాశాలలో కొత్త కోర్సు ● జిల్లాలో ఒక్కటే కాలేజీ
లక్సెట్టిపేట: డిగ్రీతోపాటు ఇంటిగ్రేటెడ్ బీఈడీ కోర్సు చేసేందుకు ప్రభుత్వం విద్యార్థులకు అవకాశం కల్పిస్తోంది. గతంలోని కోర్సుల కంటే భిన్నంగా బీఈడీ కోర్సును ప్రవేశపెట్టింది. ఇందుకోసం లక్సెట్టిపేటలోని ప్రభుత్వ మోడల్ డిగ్రీ కళాశాలను ఎంపిక చేసి కోర్సు అందిస్తోంది. విద్యార్థులు ఉన్నత విద్య, మంచి భవిష్యత్ కోసం ఒకేసారి డిగ్రీతోపాటు బీఈడీ పూర్తి చేసి ఉపాధ్యాయ పోస్టుకు ఎంపికయ్యే అవకాశాన్ని విద్యాశాఖ కల్పించింది. ఇందుకు గాను సమీకృత బీఈడీ కోర్సును బీఏ గ్రూపుతో ఆన్‌లైన్‌లో 2025–26 విద్యాసంవత్సరానికి గాను దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఈ నెల 31లోపు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్‌లో పేర్కొంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏప్రిల్ 29న ప్రవేశ పరీక్ష నిర్వహించనుంది. అర్హత సాధించిన విద్యార్థులు ఈ కోర్సులో చేరవచ్చు. ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కొత్త విధానం ద్వారా నాలుగేళ్లలోనే డిగ్రీతోపాటు బీఈడీ సర్టిఫికేట్ కోర్సును అందుకోవచ్చు.
అన్ని సౌకర్యాలతో కళాశాల
మండల కేంద్రంలోని మోడల్ డిగ్రీ కళాశాల అన్ని సౌకర్యాలతో బీఈడీ కోర్సుకు జిల్లా నుంచి ఎంపికై న ఏకై క కళాశాల. బీఏ, బీఈడీ గ్రూపులో 50సీట్లతో 2023లో కోర్సును విద్యాశాఖ మంజూరు చేసింది. కళాశాలలో అధ్యాపకులు, మౌలిక సదుపాయాలు, పట్టణానికి దూరంగా ప్రశాంత వాతావరణంలో విద్యార్థుల జీవితాలను ఉత్తమంగా తీర్చిదిద్దేందుకు సిద్ధంగా ఉంది. రాష్ట్రంలోని మూడు కళాశాలల్లో నాలుగేళ్ల బీఈడీ కోర్సు నిర్వహణకు అనుమతి లభించగా.. ఇందులో లక్సెట్టిపేట డిగ్రీ కళాశాల ఒకటి కావడం గమనార్హం. ఇంటర్మీడియెట్ పూర్తి చేసి డిగ్రీ కోర్సు చేస్తూ ఉపాధ్యాయ వృత్తిపై శ్రద్ధ ఉన్న విద్యార్థులు ఈ ప్రవేశ పరీక్ష ద్వారా సీటు సాధిస్తే భవిష్యత్‌లో మంచి ఉపాధి అవకాశం ఉంటుందని కళాశాల అధ్యాపకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కళాశాలకు నూతన కోర్సు మంజూరై రెండేళ్లు పూర్తయింది. ఆసక్తి, అర్హత కలిగిన విద్యార్థులు ఆన్‌లైన్‌లో https:// exams. nta. ac. in/ NCET/ దరఖాస్తు చేసుకుని ప్రవేశ పరీక్ష రాయాలని సూచిస్తున్నారు.
సంతోషంగా ఉంది..
కళాశాలకు సమీకృత బీఈడీ కోర్సు రావడం చా లా సంతోషంగా ఉంది. జిల్లాలోనే లక్సెట్టిపేట కళాశాలను ఎంపిక చేయ డం మంచి నిర్ణయం. నూతన కోర్సు కావడంతో విద్యార్థులు ఆసక్తి చూపిస్తున్నారు. అర్హత పరీక్ష ద్వారా విద్యార్థులకు సీట్లు కేటాయిస్తారు. ఈ నెల 31లోపు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలి.
– మహాత్మా సంతోష్, కళాశాల ప్రిన్సిపాల్
బీఏ, బీఈడీ.. నాలుగేళ్లు