● గత రాష్ట్ర బడ్జెట్‌లో జిల్లాకు నిరాశే ● మెరుగుపడని విద్య, వైద్యారోగ్యం, ఉపాధి ● నేటి బడ్జెట్‌లో కేటాయింపులపై ఆశలు | - | Sakshi
Sakshi News home page

● గత రాష్ట్ర బడ్జెట్‌లో జిల్లాకు నిరాశే ● మెరుగుపడని విద్య, వైద్యారోగ్యం, ఉపాధి ● నేటి బడ్జెట్‌లో కేటాయింపులపై ఆశలు

Mar 19 2025 12:46 AM | Updated on Mar 19 2025 12:45 AM

మందమర్రిలో మూతపడిన తోళ్ల పరిశ్రమ

జిల్లా కేంద్రంలోని రాళ్లవాగు

మాస్టర్‌ ప్లాన్‌కు నిధుల లేమి

జిల్లా కేంద్రం మున్సిపల్‌ కార్పొరేషన్‌గా అప్‌గ్రేడ్‌ అయ్యాక మాస్టర్‌ ప్లాన్‌ అమలుకు పట్టణాభివృద్ధి కోసం నిధులు కావాల్సి ఉంది. ఇందుకు కనీసం రూ.78కోట్లు అవసరం. దండేపల్లి గూడెం సత్యనారాయణ స్వామి ఆలయ అభివృద్ధికి రూ.12కోట్లు అవసరమని సీఎం రేవంత్‌రెడ్డి జిల్లా పర్యటనలోనే ఎమ్మెల్యే పీఎస్సార్‌ నిధులు ఇప్పించాలని కోరారు. అలాగే రాళ్లవాగుపై కరకట్ట, వంతెన, ఆరు వరుసల దారికి నిధులు మంజూరయ్యాయి. మంచిర్యాల అంతర్గాం బ్రిడ్జి రద్దు చేశాక, కొత్త వంతెన నిర్మాణంపై స్పష్టత రావాల్సి ఉంది.

‘వెనుకబడిన ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాను దత్తత తీసుకుంటాం. అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేస్తాం..’ అని సీఎం రేవంత్‌రెడ్డి హామీనిచ్చారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడక ముందు అసెంబ్లీ ఎన్నికల్లో హామీలు, ఏర్పడ్డాక లోక్‌సభ, ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగానూ ఈ ప్రాంత అభివృద్ధికి చొరవ తీసుకుంటామని ప్రకటించారు. ప్రస్తుత ఆర్థిక మంత్రి, నాటి సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క సైతం ‘పీపుల్స్‌ మార్చ్‌’ పాదయాత్రలో అభివృద్ధిపై హామీలు ఇచ్చారు. గతేడాది బడ్జెట్‌లో జిల్లాకు ప్రత్యేకంగా కేటాయింపులేవీ జరగలేదు. బుధవారం 2025–26 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్న నేపథ్యంలో జిల్లా ప్రజలకు నిధుల కేటాయింపులపై ఆశలు నెలకొన్నాయి. జిల్లా, నియోజకవర్గ, మండల కేంద్రాలు, గ్రామీణ మౌలిక వసతుల మెరుగు, రోడ్లు, విద్య, వైద్యారోగ్యం, పరిశ్రమలు, ఉపాధి కల్పనకు నిధుల అవసరం ఉంది.

– సాక్షి ప్రతినిధి, మంచిర్యాల

వైద్యారోగ్యం

జిల్లాలో విద్య, వైద్యారోగ్యం ఎంతగానో మెరుగు పర్చాల్సి ఉంది. బెల్లంపల్లి, చెన్నూరు, లక్సెట్టిపేట సీహెచ్‌సీలు, జిల్లా ఆసుపత్రి, మాతాశిశు సంరక్షణ కేంద్రంలో వైద్యులు, పారామెడికల్‌ సిబ్బంది పోస్టుల ఖాళీలు ఉన్నాయి. పీహెచ్‌సీల్లోనూ వైద్యాధికారులు, సిబ్బంది కొరత ఉంది. ఆరోగ్య ఉప కేంద్రాల్లోనూ సేవలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. జిల్లా కేంద్రంలోని సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి నిధుల కొరత లేకుండా ఉంటే ప్రజలకు త్వరితగతిన అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

విద్యాశాఖ

ప్రస్తుతం జిల్లాలో మూడు నియోజకవర్గాల్లో యంగ్‌ ఇండియా రెసిడెన్షియల్‌ స్కూళ్లు మంజూరయ్యాయి. దండేపల్లిలో నిర్మాణ పనులు మొదలు కాగా, బెల్లంపల్లి, చెన్నూరులో ఇంకా స్థలం ఎంపిక కాలేదు. జిల్లాలో ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీలు, డిగ్రీ కాలేజీలతోపాటు ప్రభుత్వ పరిధిలో ఇంజినీరింగ్‌ కాలేజీ లేక ఇక్కడి విద్యార్థులు హైదరాబాద్‌, వరంగల్‌ ప్రాంతాలకు వెళ్తున్నారు. బెల్లంపల్లి పాలిటెక్నిక్‌ కాలేజీని అప్‌గ్రేడ్‌ చేయాలన్నా డిమాండ్లు అలాగే మిగిలిపోతున్నాయి. ఇక జిల్లాలో ప్రతీ మండలానికి జూనియర్‌ కాలేజీ అందుబాటులోకి తేవాల్సి ఉంది. మన ఊరు–మన బడి పనులు ఇంకా పూర్తి కాలేదు. అంగన్‌వాడీ కేంద్రాలు 484 అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి.

తీరని సాగునీటి గోస

చుట్టూ నీరున్నా జిల్లాలో ఇప్పటికీ రెండు పంటలు పండించే పరిస్థితి లేదు. ఆసిఫాబాద్‌ జిల్లా కౌటాల మండలం ప్రాణహిత నదిపై తుమ్మిడిహెట్టి వద్ద నిర్మించాల్సిన భారీ నీటి పారుదల ప్రాజెక్టుతో బెల్లంపల్లి, చెన్నూరు నియోజకవర్గాలకు నీరందే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టు ఇప్పటికీ కార్యరూపం దాల్చడం లేదు. కాలువలు తవ్వి వృథాగా మిగిలిపోయాయి. కడెం కాలువ ఆధునీకరణ, వేమనపల్లి మండలంలోని నీల్వాయి ప్రాజెక్టుకు రూ.17కోట్లు అవసరం ఉంది. మత్తడివాగుకు రూ.2.90కోట్లు అవసరం ఉంది. గొల్లవాగు, ర్యాలీ వాగు ఆయకట్టును స్థిరికరించాల్సి ఉంది. ఎత్తిపోతల పథకాలు మూలన పడ్డాయి. వర్షాకాలం మొదలైతే చెరువులు, కుంటల మరమ్మతులు చేపట్టాల్సి ఉంది. గత ప్రభుత్వ హయాంలో మంజూరైన చెన్నూరు ఎత్తిపోతలు రద్దయాయి. ఆ స్థానంలో కొత్తగా ప్రతిపాదనలు సిద్ధం చేయాల్సి ఉంది. ఇక హాజీపూర్‌ మండలం పడ్తన్‌పల్లి ఎత్తిపోతలు రద్దయ్యాయి. వాటి స్థానంలోనే దండేపల్లి మండలం ద్వారక, గుడిరేవు, గూడెం, లక్సెట్టిపేట మండలం మోదలలో నాలుగు ఎత్తిపోతలు గోదావరి నుంచి నీటిని వాడుకునేలా ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు ప్రణాళికలు వేశారు. నిధుల విడుదల లేమితో గతేడాది నుంచి అడుగు ముందుకు పడడం లేదు.

పరిశ్రమలు, ఉపాధి

పరిశ్రమలకు ఊతం ఇచ్చేలా బెల్లంపల్లిలోని ఫుడ్‌ప్రాసెసింగ్‌ జోన్‌ పూర్తి చేయడం, మందమర్రిలో తోళ్లపరిశ్రమ పునరుద్ధరణ, మంచిర్యాల కార్పొరేషన్‌ పరిధిలో ఏర్పాటు చేయబోతున్న ఐటీ పార్కు, ఇండస్ట్రీయల్‌ కారిడార్‌కు నిధులు కేటాయించాల్సి ఉంది. పర్యాటకంగా అభివృద్ధి చేసే అవకాశమున్నా నిధుల లేమితో ముందుకు సాగడం లేదు.

● గత రాష్ట్ర బడ్జెట్‌లో జిల్లాకు నిరాశే ● మెరుగుపడని వి1
1/5

● గత రాష్ట్ర బడ్జెట్‌లో జిల్లాకు నిరాశే ● మెరుగుపడని వి

● గత రాష్ట్ర బడ్జెట్‌లో జిల్లాకు నిరాశే ● మెరుగుపడని వి2
2/5

● గత రాష్ట్ర బడ్జెట్‌లో జిల్లాకు నిరాశే ● మెరుగుపడని వి

● గత రాష్ట్ర బడ్జెట్‌లో జిల్లాకు నిరాశే ● మెరుగుపడని వి3
3/5

● గత రాష్ట్ర బడ్జెట్‌లో జిల్లాకు నిరాశే ● మెరుగుపడని వి

● గత రాష్ట్ర బడ్జెట్‌లో జిల్లాకు నిరాశే ● మెరుగుపడని వి4
4/5

● గత రాష్ట్ర బడ్జెట్‌లో జిల్లాకు నిరాశే ● మెరుగుపడని వి

● గత రాష్ట్ర బడ్జెట్‌లో జిల్లాకు నిరాశే ● మెరుగుపడని వి5
5/5

● గత రాష్ట్ర బడ్జెట్‌లో జిల్లాకు నిరాశే ● మెరుగుపడని వి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement