
నిలిచిన భూ సర్వే
బెల్లంపల్లి: బెల్లంపల్లి మున్సిపాల్టీ పరిధి రైల్వేస్టేషన్ ఎదురుగా ఉన్న భూమిలో జాయింట్ సర్వేకు సిద్ధపడగా దేవాదాయ శాఖ అధికారులు అభ్యంతరం చె ప్పడంతో నిలిచిపోయింది. పాత హద్దుల ప్రకారం కాకుండా రెవెన్యూ శాఖ సర్వేయర్లు కొత్త హద్దుల ను ప్రతిపాదించడంతో నిరాకరించారు. రైల్వేస్టేషన్ ముందున్న విలువైన భూమిపై కొంతకాలంగా వి వాదం జరుగుతోంది. ఆకెనపల్లి శివారు సర్వే నంబ రు 12/6లో 3.02 ఎకరాల భూమి రెవెన్యూ రికార్డుల్లో దేవాదాయ శాఖకు చెందినదిగా నమోదై ఉంది. ఆ పక్కన ఉన్న సర్వేనెంబర్ 12/4లో భూమి కలిగి ఉన్న కొందరు దేవాదాయ శాఖ భూమి పరిధిలో తమ భూమి కొంతమొత్తం ఉందని చెబుతున్నారు. దీంతో ఇరువురి మధ్య భూ వివాదం ఏర్పడింది. జాయింట్ సర్వే చేయాలని నిర్ణయించుకుని ఇరు శాఖల అధికారులు మొఖా వద్దకు వచ్చారు. రెవె న్యూ శాఖ సర్వేయర్లు భూ కొలతలు చేయడానికి సిద్ధపడగా హద్దుల వద్ద తేడా రావడంతో దేవాదా య శాఖ అధికారులు అడ్డుపడ్డారు. సర్వే సరిగా జ రగడం లేదని గ్రహించి ఆపేశారు. శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లి నిర్ణయం తీసుకుంటామని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు. దేవాదాయ శాఖ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అసిస్టెంట్ కమిషనర్ నవీన్‌కుమార్, దేవాదాయ శాఖ సర్వేయర్ అనిల్ కుమార్, రెవెన్యూ డివిజనల్ సర్వేయర్ నసీరొద్దీన్, దేవాదాయ ఈఓలు, సర్వేయర్ పాల్గొన్నారు.