జైపూర్: కంపోస్ట్ పిట్‌ల నిర్వహణ సక్రమంగా చేపట్టాలని, వాటి ద్వారా వచ్చే ఎరువులను నర్సరీలు, పల్లెప్రకృతి వనంలో మొక్కలకు అందించాలని డీపీవో వెంకటేశ్వర్‌రావు తెలిపారు. మండలంలోని ముదిగుంట, జైపూర్ గ్రామ పంచాయతీలను బుధవారం ఆయన సందర్శించారు. సెగ్రిగేషన్ షెడ్‌లను పరిశీలించి కంపోస్ట్ ఎ రువుల తయారీపై పలు సూచనలు చేశారు. రోడ్లు, డ్రెయినేజీలు నిరంతరం శుభ్రం చేయాలని, ప్రతీ రోజు ఇంటింటికీ గ్రామ పంచాయతీ ట్రాక్టర్ ద్వా రా చెత్త సేకరించాలని తెలిపారు. ఎంపీవో అనిల్‌కుమార్, పంచాయతీ కార్యదర్శులు ఉదయ్, సురేశ్, సిబ్బంది ఉన్నారు.