
కార్మికుల హక్కుల పరిరక్షణకు కృషి
రెబ్బెన(ఆసిఫాబాద్): ఏఐటీయూసీకి కార్మికులు ఎంతో నమ్మకంతో గుర్తింపు హోదా కల్పించారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా నిత్యం అందుబాటులో ఉంటూ హక్కుల పరిరక్షణ కోసం కృషి చేస్తామని ఏఐటీయూసీ గోలేటి బ్రాంచి కార్యదర్శి ఎస్.తిరుపతి అన్నారు. సోమవారం బెల్లంపల్లి ఏరియాలోని కై రిగూడ ఓసీపీలో ఏఐటీయూసీ నూతన పిట్ కమిటీని యాజమాన్యానికి పరిచయం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బొగ్గు ఉత్పత్తికి ఇచ్చే ప్రాధాన్యత కార్మిక శ్రేయస్సుకు కూడ ఇవ్వాలని అన్నారు. యాజమాన్యం నిర్దేషించిన లక్ష్య సాధనకు ఏఐటీయూసీ పూర్తి స్థాయిలో సహకరిస్తుందని, అదే తరహాలో కార్మిక సంక్షేమానికి యాజమాన్యం కట్టుబడి పని చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజింగ్ కార్యదర్శులు జగ్గయ్య, శేషు, రాజేశ్, కిరణ్‌బాబు, చంద్రశేఖర్, దివాకర్, తదితరులు పాల్గొన్నారు.