విద్యార్థులకు అస్వస్థత.. జిల్లా ఆస్పత్రిలో చికిత్స
జోగుళాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం ధర్మవరంలోని ప్రభుత్వ బీసీ బాలుర హాస్టల్ విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం రాత్రి 7.45 గంటల ప్రాంతంలో భోజనం చేయగా.. 9 గంటల తర్వాత విద్యార్థులు ఒక్కొక్కరు వాంతులు చేసుకున్నారు. గమనించిన హాస్టల్ సిబ్బంది అంబులెన్స్‌కు సమాచారం అందించగా ఎస్‌ఐ మురళి సిబ్బందితో అక్కడికి చేరుకొని ముందుగా మూడు అంబులెన్స్‌లలో 35
మంది విద్యార్థులను జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత మరో 20 మంది విద్యార్థులు చికిత్స కోసం ఆస్పత్రికి చేరుకోగా.. మొత్తం 55 మంది విద్యార్థులను ఆస్పత్రిలోని రెండు మెడికల్ వార్డులలో ఉంచి 20 మంది వైద్యులు చికిత్స అందిస్తున్నారు. – ఎర్రవల్లి