రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

Nov 1 2025 9:17 AM | Updated on Nov 1 2025 9:17 AM

రోడ్డ

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

ఉండవెల్లి: మండలంలోని జాతీయ రహదారిపై జరిగిన రోడ్డుప్రమాదంలో వ్యక్తి దుర్మరణం చెందిన ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఉండవెల్లికి చెందిన రాజు అలియాస్‌ చింటు(33) కర్నూల్‌లో ప్రైవేటు ఉద్యోగి. రోజువారీగా శుక్రవారం బైక్‌పై ఉద్యోగానికి వెళ్తుండగా.. ఉండవెల్లి శివారులో వెనుక నుంచి వచ్చిన కారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. హైవే అంబులెన్స్‌లో కర్నూల్‌ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. మృతిచెందిన వ్యకిక్తి భార్య అమ్ములు, ఇద్దరు కుమారులు ఉన్నారు. కుటుంబ పెద్దదిక్కు మృతిచెందడంతో శోఖసంద్రంలో మునిగిపోయారు. ప్రమాద స్థలం వద్ద వాహనాలు అధికసంఖ్యలో నిలిచిపోవడంతో హైవే సిబ్బంది, పోలీసులు నియంత్రించారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

స్తంభం తలపై పడి వ్యక్తి మృతి

వనపర్తి రూరల్‌: స్తంభం తలపై పడి వ్యక్తి మృతిచెందిన ఘటన పెబ్బేరు మండలంలో శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ యుగేందర్‌ రెడ్డి కథనం ప్రకారం.. కొత్తకోట మండలం నాటవెల్లికి చెందిన బాలరాజుగౌడ్‌ పెబ్బేరు మండలం వైశాఖాపూర్‌లో ఎస్వీఆర్‌ మినరల్స్‌ కంపెనీలో టిప్పర్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. శుక్రవారం ఉదయం ఇంటి నుంచి కంపెనీకి వచ్చాడు. కంపెనీ దగ్గరున్న స్తంభాన్ని ఆపరేటర్‌ హిటాచీతో తీస్తుండగా ప్రమాదవశాత్తు జారిపోవడంతో అక్కడే ఉన్న బాలరాజుగౌడ్‌ తలపై పడడంతో తలకు తీవ్ర గాయమైంది. వెంటనే వనపర్తి ఆస్పత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతిచెందాడని తెలిపారు. మృతుడికి భార్య అనురాధ, ఇద్దరు కూతురర్లు, కుమారుడు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్‌ఐ తెలిపారు.

విద్యుదాఘాతంతో

యువకుడి మృతి

భూత్పూర్‌: మున్సిపాలిటీలోని గోప్లాపూర్‌లో విద్యుదాఘాతంతో పి.కార్తీక్‌ (19) అనే యువకుడు మృతి చెందాడు. కుటుంబ సభ్యుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన సావిత్రి, తుల్జానాయక్‌కు కుమారుడు కార్తీక్‌, ఓ కుమార్తె ఉన్నారు. శుక్రవారం నూతనంగా నిర్మిస్తున్న ఇంటికి కార్తీక్‌ నీరు పట్టేందుకు సర్వీస్‌ వైర్‌ను ప్లగ్‌లో పెడుతుండగా కరెంట్‌ షాక్‌ గురయ్యాడు. స్థానికులు గుర్తించి జిల్లా జనరల్‌ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు తెలిపారు.

ఉరేసుకొని వ్యక్తి మృతి

అచ్చంపేట: మండలంలోని హాజీపూర్‌ వ్యక్తి ఉరి వేసుకొని అత్మహత్యకు పాల్పడ్డాడు. పూర్తి వివరాలు.. వంగూరు మండలం ఉమాపూర్‌ గ్రామానికి చెందిన వెంకటయ్య(49)గురువారం వివాహా నిమిత్తం గ్రామంలోని బంధువుల ఇంటికి వచ్చాడు. అనంతరం రాత్రి గ్రామ శివారులోని చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి భార్య హైమావతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ఇందిరా తెలిపారు.

చికిత్స పొందుతూ వ్యక్తి

ఎర్రవల్లి: చికిత్స పొందుతూ వ్యక్తి మృతి చెందిన ఘటన ఇటిక్యాల పీఎస్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ రవినాయక్‌ కథనం మేరకు.. ఇటిక్యాల మండల పరిధిలోని ఉదండాపురానికి చెందిన పింజరి నబీసాబ్‌(43) బైక్‌పై స్వగ్రామం నుంచి శుక్రవారం కొండపేటకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో జాతీయ రహదారిపై విజయ ఆయిల్‌ మిల్లు సమీపంలో రాంగ్‌ రూట్‌లో వెళ్తుండగా పెబ్బేరు నుంచి ఎర్రవల్లి వెళ్తున్న గుర్తు తెలియని వాహనం తన బైక్‌ను ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి భార్య పింజరి పీరమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ పేర్కొన్నారు.

పేకాట స్థావరంపై దాడి

వనపర్తి రూరల్‌: పట్టణ శివారులో జిల్లా కేంద్రానికి చెందిన కొందరు వ్యక్తులు పేకాట ఆడుతుండగా సమాచారం అందుకున్న పోలీసులు శుక్రవారం దాడి చేసి ఏడుగురిని పట్టుకున్నట్లు పట్టణ ఎస్‌ఐ హరిప్రసాద్‌ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని మెట్టుపల్లి శివారులో కొందరు వ్యక్తులు పేకాట ఆడుతున్నట్లు పక్కా సమాచారం అందిందన్నారు. దీంతో పోలీసులు దాడులు చేసి పేకాట ఆడుతున్న 8మంది అరెస్ట్‌ చేసి వారి నుంచి రూ.7,400 నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ వెల్లడించారు.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం 
1
1/3

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం 
2
2/3

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం 
3
3/3

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement