బీసీలను మోసగించే కుట్రలను తిప్పికొడదాం
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్)/రాజాపూర్: బీసీలను మోసగించే కుట్రలను తిప్పికొడదామని.. రాజ్యాధికారం దిశగా బీసీలు తమ హక్కులను పోరాడి సాధించుకోవాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పేర్కొన్నారు. శుక్రవారం మహబూబ్‌నగర్ పీయూ సమీపంలో టీఆర్‌పీ జిల్లా ప్రధాన కార్యదర్శి రవికముదిరాజ్ ఆధ్వర్యంలో పలువురు టీఆర్‌పీలో చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ బీసీల 42 శాతం రిజర్వేషన్ల విషయంలో చిత్తశుద్ధి లేకుండా ముందుకు వెళ్లి స్థానిక సంస్థల ఎన్నికలు బీసీ రిజర్వేషన్ల జీఓపై హైకోర్టు స్టే విధించే వరకు తీసుకువచ్చిందని అన్నారు. తమిళనాడు తరహాలో రాజ్యాంగ సవరణ చేసి 9వ షెడ్యూల్‌లో పెడితే తప్ప చట్టబద్ధత ఉండదని మొదటి నుంచి చెబుతూ ఉన్నామని కానీ ఆ విషయంలో అన్ని పార్టీలు బీసీలను మోసం చేసేందుకే ప్రయత్నం చేశాయన్నారు. రాష్ట్రంలో అన్ని ప్రధాన పార్టీల అధినాయకత్వం మొత్తం అగ్రవర్ణ చేతిలో ఉందని, కాబట్టి బీసీల 42 శాతం రిజర్వేషన్ విషయంలో బీసీలను ఓటు బ్యాంకుగానే వాడుకునేందుకే చూస్తున్నాయన్నారు. .
నేటికి పాలమూరు నుంచి వలసలు ఆగలేదు
ప్రత్యేక తెలంగాణ ఏర్పడినా మన పాలమూరు జిల్లా నుంచి నేటికి వలసలు ఆగలేదని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. ఆయన హైదరాబాద్ నుంచి కురుమూర్తి దేవస్థానానికి వెళ్తూ రాజాపూర్‌లో ఆగి అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. నేడు ఉద్యోగాలు.. నిధులు, నియామకాలల్లో అన్నింటిలో దొంగతనం చేసుకుంటూ మనసొమ్మే వాళ్లు తినుకుంటూ మనల్ని సాకుతున్నామని చెబుతున్నారని ఆరోపించారు. మనం రాజ్యాధికారంలోకి వస్తే తప్పా మన బతుకులు మారవని, బీసీలు ముఖ్యమంత్రులు కావాలే అని అన్నారు.
కురుమూర్తి ఆలయంలో ప్రత్యేక పూజలు
చిన్నచింతకుంట: మండలంలోని అమ్మాపురం కురుమూర్తిస్వామి జాతరను పురస్కరించుకొని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న శుక్రవారం ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు.
బీసీలను మోసగించే కుట్రలను తిప్పికొడదాం
బీసీలను మోసగించే కుట్రలను తిప్పికొడదాం


