
స్నేహంలో నిజాయితీ ఉండాలి
– ఏక్తా, బైపీసీ, మొదటి సంవత్సరం
స్వేచ్ఛ ఉంటుంది
స్నేహితులు చాలా ముఖ్యమైన వారు. వారితో తల్లిదండ్రులతో పంచుకోలేని విషయాలను కూడా చెప్పుకొనే స్వేచ్ఛ ఉంటుంది. బాధ, కష్టం వేసినప్పుడు మిత్రులతో వాటిని పంచుకుంటే అది తగ్గిపోతుంది. జీవితాంతం కొనసాగే స్నేహంతో మంచి వైపు ప్రయాణం చేయాలి. అలాంటి స్నేహితులు ప్రతిఒక్కరికి అవసరం.
– కె.యశస్విని, ఎంపీసీ, రెండో సంవత్సరం
● రిషి జూనియర్ కళాశాలలో ‘సాక్షి’ ఆధ్వర్యంలో టాక్‌షో
● విభిన్న అభిప్రాయాలు వ్యక్తం చేసిన విద్యార్థులు
ఆ విషయాలు పట్టించుకోవద్దు..
చాలామంది స్నేహితులు పక్కవారి సీరియస్ విషయాల్లో తలదూరుస్తారు. ప్రతి విషయానికి ఒక పరిధి అనేది ఉంటుంది. అందులో ఉన్నప్పుడు ఇబ్బందులు రావు. స్నేహితులు చిన్న విషయాల్లో సలహాలు, సూచనలు చేయవచ్చు. స్టడీస్ విషయంలో సహకరించాలి. కానీ, అనవసరమైన విషయాల్లోకి వెళ్లడం వల్ల స్నేహంపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది.
– సాయి చందన, బైపీసీ, మొదటి సంవత్సరం
మంచివారితో స్నేహం..
మంచివారితో స్నేహం చేయడం వల్ల మంచి వైపు జీవితం వెళ్తుంది. మనం స్నేహితుల ప్రవర్తనను బట్టి ఎలాంటి వారు అనేది తెలుస్తుంది. అందులో మంచి వారితో పరించయం పెంచుకుంటే మంచి విషయాలను నేర్చుకోవచ్చు. కీలకమైన నిర్ణయాల్లో స్నేహితుల సహకారం ఎప్పటికీ ఉండాలి.
– కె.సహస్ర, ఎంపీసీ, రెండో సంవత్సరం
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: ‘స్నేహంలో నిజాయితీ ఉండాలి.. అలాంటి స్నేహమే కలకాలం కొనసాగుతుంది.. అవసరం కోసం చేసే స్నేహం కొన్నిరోజులే నిలుస్తుంది’ అని విద్యార్థులు పేర్కొన్నారు. జిల్లాకేంద్రం సమీపంలోని తిరుమల హిల్స్ రిషి జూనియర్ కళాశాల గర్‌ల్స్ క్యాంపస్‌లో ‘సాక్షి’ మీడియా నిర్వహించిన టాక్ షోకు అనూహ్య స్పందన లభించింది. పెద్దసంఖ్యలో విద్యార్థులు పాల్గొని స్నేహితుల దినోత్సవంపై వారి అభిప్రాయాలను పంచుకున్నారు.
●
టైంపాస్ కోసం వద్దు..
స్నేహం అంటే చాలా మంది టైపాస్ చేయడం అనుకుంటారు. కానీ, స్నేహం స్కూల్ స్థాయిలో మొదలైతే జీవితాంతం కొనసాగాలి. ఈ రోజు ఉండి.. రేపు వెళ్లిపోయే స్నేహితులు వారి అవసరాల కోసం మాత్రమే స్నేహం చేస్తారు. మంచి స్నేహితులతో స్నేహం చేస్తే వారు మంచి విషయాలు చెప్పి, తప్పులను సరిదిద్దేలా ఉండాలి. నిజం మాట్లాడే వారికి ప్రాధాన్యత ఇవ్వాలి. – హన్సిత, బైపీసీ, మొదటి సంవత్సరం

స్నేహంలో నిజాయితీ ఉండాలి

స్నేహంలో నిజాయితీ ఉండాలి

స్నేహంలో నిజాయితీ ఉండాలి

స్నేహంలో నిజాయితీ ఉండాలి