ఫోరెన్సిక్‌ మొబైల్‌ సేవలు అవసరం | - | Sakshi
Sakshi News home page

ఫోరెన్సిక్‌ మొబైల్‌ సేవలు అవసరం

Aug 3 2025 8:31 AM | Updated on Aug 3 2025 8:31 AM

ఫోరెన

ఫోరెన్సిక్‌ మొబైల్‌ సేవలు అవసరం

మహబూబ్‌నగర్‌ క్రైం: నేరాల పరిశీలనలో ఆధునిక సాంకేతికతను వినియోగించడానికి, న్యాయ నిపుణుల సహకారంతో కేసుల పరిష్కారంలో పోలీస్‌శాఖ మరో అడుగు ముంద ుకు వేసిందని ఎస్పీ డి.జానకి అన్నారు. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుంచి జిల్లాకు నూతనంగా కేటాయించిన మొబైల్‌ ఫోరెన్సిక్‌ వాహనాన్ని శనివారం పరేడ్‌ మైదానంలో ఎస్పీ ప్రారంభించారు. ఇందులో ఆధునిక ఫోరెన్సిక్‌ పరికరాలు, క్లూస్‌ టీంకు అవసరం అయిన డివైజ్‌లు అందుబాటులో ఉండటం వల్ల సంఘటన జరిగిన స్థలానికి వెంటనే చేరుకుని ఆధారాలు సేకరించడానికి ఎంతో ఉపయోగపడుతుందన్నారు. కేసుల పరిష్కారంలో కచ్చితమైన న్యాయం అందించే దిశగా పోలీస్‌శాఖ పని చేస్తోందన్నారు. ఏఎస్పీలు ఎన్‌బీ రత్నం, సురేష్‌కుమార్‌, డీఎస్పీ శ్రీనివాసులు, ఇన్‌స్పె క్టర్‌ రాజేంద్రప్రసాద్‌, ఆర్‌ఐలు కృష్ణయ్య, రవి, నగేష్‌ పాల్గొన్నారు.

ఏఆర్‌ సిబ్బంది ఆరోగ్యంపై

దృష్టి సారించాలి

పోలీస్‌ విధుల్లో నిత్యం ఒత్తిడి, భౌతిక మానసిక శ్రమ ఎక్కువగా ఉంటుందని, ప్రతి ఒక్క రూ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఎస్పీ జానకి అన్నారు. వీక్లీ పరేడ్‌లో ఆమె సిబ్బందితో మాట్లాడుతూ వారి సమస్యలను తెలుసుకున్నారు. పోలీస్‌ సిబ్బందికి సమయం ఉన్నప్పుడు కుటుంబసభ్యులతో గడుపాలని, యోగా, మెడిటేషన్‌ నిత్యం చేయడం వల్ల శారీరకంగా మానసికంగా బలంగా మారవచ్చునన్నారు. విధుల్లో నిబద్ధతతో పాటు సేవా దృక్పథాన్ని ప్రదర్శించాలని, దీంతో పా టు ప్రజల నమ్మకాన్ని గెలుచుకోవాలన్నారు.

ఆన్‌లైన్‌లో పదోన్నతుల సీనియార్టీ జాబితా

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: జిల్లావ్యాప్తంగా వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల పదోన్నతులుక సంబంధించి సీనియార్టీ జాబితాను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచినట్లు డీఈఓ ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు. ఈమేరకు వివరాల కోసం పాలమూరు బడి వెబ్‌సైట్‌ను సందర్శించాలని, సీనియార్టీ జాబితాలో ఉన్న ఉపాధ్యాయులు తమ సర్వీస్‌ బుక్‌తో జిల్లాకేంద్రంలోని బీఈడీ కళాశాలకు ఆదివారం ఉదయం రావాలని సూచించారు. వీటితో పాటు సీనియర్టీ జాబితాపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలపాలని కోరారు.

ముగ్గురు డిప్యూటీ కలెక్టర్ల నియామకం

జెడ్పీసెంటర్‌(మహబూబ్‌నగర్‌): ఉమ్మడి పాలమూరు జిల్లాకు బదిలీపై ముగ్గురు డిప్యూటీ కలెక్టర్లు రానున్నారు. ఈ మేరకు శనివారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అందులో భాగంగా పోస్టింగ్‌కు కోసం వెయిటింగ్‌లో ఉన్న డిప్యూటీ కలెక్టర్‌ కోమల్‌రెడ్డి మహబూబ్‌నగర్‌ స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌గా, కిమ్యా నాయక్‌ వనపర్తి జిల్లా అడిషనల్‌ కలెక్టర్‌ (రెవెన్యూ)గా, నారాయణపేట భూసేకరణ డిప్యూ టీ కలెక్టర్‌గా రాజేందర్‌గౌడ్‌ నియమితులయ్యా రు. రాష్ట్ర మైనార్టీ శాఖలో పని చేస్తున్న జనార్దన్‌రెడ్డి కల్వకుర్తి ఆర్‌డీఓగా రానున్నారు.

రైతు హితమే కేంద్ర ప్రభుత్వ అభిమతం

మహబూబ్‌నగర్‌ రూరల్‌: రైతు హితమే కేంద్ర ప్రభుత్వ అభిమతం అని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, ఎంపీ డీకే అరుణ అన్నారు. శనివారం పీఎం కిసాన్‌ సమ్మాన్‌ 20వ విడత నిధుల విడుదల కార్యక్రమాన్ని అధికారులు, రైతులతో కలిసి ఆమె ప్రత్యక్షంగా ప్రధాని మోదీ సందేశాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ రైతు సంక్షేమమే ధ్యేయంగా మోదీ ప్రభుత్వం నిరంతరం పని చేస్తోందన్నారు. తమ ప్రభుత్వం చేసేదే చెబుతుందని, చెప్పిందే చేసి చూపుతుందన్నారు. పీఎం కిసాన్‌ సమ్మాన్‌ పథకం ద్వారా ఇప్పటి వరకు మహబూబ్‌నగర్‌ జిల్లాలోని 65,996 మంది రైతులకు లబ్ధి కలిగిందన్నారు. రైతులకు లబ్ధి చేకూర్చేందుకే కిసాన్‌ సమ్మాన్‌, ఫసల్‌ బీమా యోజన,ధాన్య సమృది,్ధ కిసాన్‌ క్రెడిట్‌ కార్డులు వంటి పథకాలను తీసుకొచ్చామన్నారు. డీఏఓ బి.వెంకటేష్‌, ఏడీఎ రాంపాల్‌, ఏఓ శ్రుతి, తహసీల్దార్‌ శ్రీనివాసులు, ఎంపీడీఓ కరుణశ్రీ, నాయకులు పద్మజారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, గంగన్న, శ్రీనివాస్‌రెడ్డి, శ్రీరాములు, పాండురంగారెడ్డి, రాజుగౌడ్‌, మహేష్‌గౌడ్‌, కిరణ్‌కుమార్‌రెడ్డి, జాం శ్రీనివాసులు పాల్గొన్నారు.

ఫోరెన్సిక్‌ మొబైల్‌ సేవలు అవసరం 
1
1/1

ఫోరెన్సిక్‌ మొబైల్‌ సేవలు అవసరం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement