220 గ్రాముల ఎండు గంజాయి పట్టివేత | - | Sakshi
Sakshi News home page

220 గ్రాముల ఎండు గంజాయి పట్టివేత

Aug 3 2025 8:31 AM | Updated on Aug 3 2025 8:31 AM

220 గ

220 గ్రాముల ఎండు గంజాయి పట్టివేత

మహబూబ్‌నగర్‌ క్రైం: ఇటీవల జిల్లాలో ఎండు గంజాయి సరఫరా పెరిగింది. తాజాగా ఇద్దరు యువకులు 220 గ్రాముల ఎండు గంజాయిని తరలిస్తూ ఎకై ్సజ్‌ పోలీసులకు పట్టుబడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. జిల్లా అసిస్టెంట్‌ ఎకై ్సజ్‌ అధికారి నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో సీఐ వీరారెడ్డి, ఎస్‌ఐ సుధాకర్‌రెడ్డి సిబ్బందితో కలిసి శనివారం తెల్లవారుజామున జిల్లా కేంద్రంలోని బైపాస్‌ చౌరస్తా సమీపంలో వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో ఓ బైక్‌పై హైదరాబాద్‌కు చెందిన మహ్మద్‌ రియాజ్‌, సయ్యద్‌ అబ్దుల్‌ హుస్సెన్‌ 220 గ్రాముల ఎండు గంజాయిని తరలిస్తుండగా పట్టుకున్నారు. చిన్న చిన్న పాకెట్‌లలో ఎండు గంజాయిని విక్రయించేందుకు జిల్లా కేంద్రానికి వస్తున్నట్లు తెలిసింది. వీరి నుంచి గంజాయితో పాటు రెండు సెల్‌ఫోన్లు, బైక్‌ స్వాధీనం చేసుకొని సీజ్‌ చేశారు. పట్టుబడిన యువకులపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చగా.. రిమాండ్‌కు తరలించినట్లు ఎకై ్సజ్‌ అధికారులు తెలిపారు. ఎండు గంజాయిని పట్టుకున్న బృందాన్ని ఉమ్మడి జిల్లా డిప్యూటీ కమిషనర్‌ విజయ్‌ భాస్కర్‌రెడ్డి, జిల్లా ఎకై ్సజ్‌ అధికారి సుధాకర్‌ అభినందించారు.

భూ రిజిస్ట్రేషన్‌ ఆపాలని..

పురుగు మందు డబ్బాతో రైతు హల్‌చల్‌

గట్టు: స్థానిక తహసీల్దార్‌ కార్యాలయంలో శనివారం భూ రిజిస్ట్రేషన్‌ ఆపాలని ఓ రైతు పురుగు మందు డబ్బాతో హల్‌చల్‌ చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. గట్టు గ్రామ శివారులోని సర్వే నంబర్‌ 7లో ఉన్న కొంత భూమిని యజమాని గడ్డం నర్సింహులు మరో వ్యక్తి వడ్డె పరుశరామ్‌కు విక్రయించేందుకు స్లాట్‌ బుక్‌ చేసుకున్నారు. శనివారం ఇరువురు తహసీల్దార్‌ కార్యాలయంలో రిజిస్ట్రేషన్‌ చేసుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే గట్టుకు చెందిన రైతు తెలుగు శంకర్‌ పురుగు మందు డబ్బాతో తహసీల్దార్‌ కార్యాలయానికి చేరుకున్నాడు. తాను ఇదే సర్వే నంబర్‌లోని భూమిని కొనుగోలు చేసేందుకు గతంలో ఒప్పందం చేసుకున్నానని.. తనకు విక్రయించకుండా మరొకరికి ఎలా విక్రయిస్తారంటూ ప్రశ్నించాడు. భూ రిజిస్ట్రేషన్‌ ఆపాలని.. తన వెంట తెచ్చుకున్న పురుగు మందు తాగేందుకు యత్నిస్తుండగా అక్కడే ఉన్న కార్యాలయ సిబ్బంది అడ్డుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసుల తహసీల్దార్‌ కార్యాలయానికి చేరుకొని పరిస్థితిని చక్కదిద్దారు. అయితే భూ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను పూర్తిచేసినట్లు తెలిసింది.

ఇద్దరు యువకులకు రిమాండ్‌

220 గ్రాముల ఎండు గంజాయి పట్టివేత  
1
1/1

220 గ్రాముల ఎండు గంజాయి పట్టివేత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement