
జూరాలకు కొనసాగుతున్న వరద
ధరూరు: మహారాష్ట్ర, కర్ణాటకలో కురిసిన భారీ వర్షాలతో ప్రియదర్శిని జూరాల జలాశయానికి వరద కొనసాగుతోందని పీజేపీ అధికారులు తెలిపారు. గురువారం సాయంత్రం 1.07 లక్షల క్యూసెక్కుల వరద రాగా.. ప్రాజెక్టు 12 క్రస్ట్ గేట్లు ఎత్తి 79,740 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జెన్‌కో జల విద్యుత్ కేంద్రంలోని 11 యూనిట్ల నుంచి ఉత్పత్తి కొనసాగుతుందని.. ఇందుకోసం 29,220 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నట్లు చెప్పారు. నెట్టెంపాడుకు 750 క్యూసెక్కులు, కోయిల్‌సాగర్‌కు 315, భీమా లిఫ్ట్–1కు 1,300, ఆవిరి రూపంలో 44, ఎడమ కాల్వకు 770, కుడి కాల్వకు 460, ఆర్డీఎస్ లింక్ కెనాల్‌కు 150, సమాంతర కాల్వకు 600, భీమా లిఫ్ట్–2కు 750 క్యూసెక్కుల నీటిని తరలిస్తున్నట్లు చెప్పారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 7.480 టీఎంసీలు ఉన్నట్లు తెలిపారు.
కోయిల్‌సాగర్‌కు జలకళ..
దేవరకద్ర: కోయిల్‌సాగర్ జలాశయంలో గురువారం సాయంత్రం 23.6 అడుగుల నీటిమట్టం ఉన్నట్లు అధికారులు తెలిపారు. మరో 3 అడుగుల నీరు చేరితే పాత అలుగుస్థాయి నీటి మట్టం 26.6 అడుగులకు చేరుతుంది.
సుంకేసుల జలాశయం..
రాజోళి: సుంకేసుల జలాశయానికి ఎగువ నుంచి వరద కొనసాగుతోంది. గురువారం 49,800 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. 13 గేట్లు ఎత్తి 51,883 క్యూసెక్కులు దిగువకు విడుదల చేసినట్లు జేఈ మహేంద్ర తెలిపారు. బుధవారం 15 గేట్ల ద్వారా నీటి విడుదల జరగగా.. గురువారం స్వల్పంగా వరద తగ్గడంతో 13 గేట్ల నుంచి దిగువకు నీరు వదిలినట్లు పేర్కొన్నారు.
12 క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల
కొనసాగుతున్న విద్యుదుత్పత్తి