
పట్ట పగలే ఇంట్లో చోరీ
చిన్నచింతకుంట: గుర్తు తెలియని వ్యక్తులు పట్టపగలు ఇంట్లోకి చొరపడి రూ3.30లక్షల విలువ గల వస్తువులు చోరీ చేసిన ఘటన మండలంలో బుధవారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా.. మండలంలోని ఉంధ్యాల గ్రామానికి చెందిన మహమ్మద్ అక్రమ్, అతని తల్లి ఫహిదా బేగం గాజుల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వారు మధ్యాహ్నం సమయంలో ఇంట్లోనే నిద్రిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి బీరువా తాళాలు పగులగొట్టి 3.9 తులాల బంగారం, 19 తులాల వెండి ఆభరణాలతో పాటు ఒక మొబైల్ ఫోన్‌ను ఎత్తుకెళ్లారు. తల్లీకొడుకులు సాయంత్రం సమయంలో ఇంట్లో తెరిచి ఉన్న బీరువాను చూసి అందులో ఉన్న వస్తువులు కనిపించక పోయేసరికి ఆందోళన చెందారు. వెంటనే చిన్నచింతకుంట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఘటనపై గురువారం ఎస్‌ఐ రాంలాల్‌నాయక్ ఆధ్వర్యంలో పోలీసులు క్లూస్‌టీంతో ఘటనా స్థలంలో వేలిముద్రలు సేకరించారు.
బంగారు, వెండి ఆభరణాల అపహరణ