రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం

Jul 10 2025 6:20 AM | Updated on Jul 10 2025 6:20 AM

రోడ్డ

రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం

ఎర్రవల్లి: జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొని యువకుడు దుర్మరణం చెందిన ఘటన చోటు చేసుకుంది. ఇటిక్యాల ఎస్సై వెంకటేశ్‌ కథనం మేరకు.. బీహార్‌లోని పాట్నా జిల్లా లోదిపూర్‌కు చెందిన సోనెలాల్‌ సింగ్‌ (25) నాలుగు నెలల క్రితం గద్వాల మండలంలోని అనంతాపురం సమీపంలో గల ఓ రైస్‌ మిల్లులో కూలీ పనినిమిత్తం వచ్చి మిత్రులతో కలిసి ఉంటున్నాడు. మంగళవారం స్వగ్రామానికి వెళ్తానని తోటి మిత్రులకు చెప్పి ఎర్రవల్లి కూడళికి వచ్చాడు. ఈ క్రమంలో రాత్రి పుల్లారెడ్డి పెట్రోల్‌ బంక్‌ సమీపంలో జాతీయ రహదారిని దాటుతుండగా గుర్తు తెలియని వాహన ఢీకొట్టడంతో తీవ్ర రక్త గాయాలై అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని అబులెన్స్‌లో గద్వాల మార్చురీకి తరలించారు. మృతుడి మిత్రుడు సుభాష్‌ ఫిర్యాదు మేరకు బుధవారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నాడు.

కారు బోల్తా: వ్యక్తి మృతి

పెద్దకొత్తపల్లి: మండలంలోని వావిళ్లబావి గ్రామం వద్ద బుధవారం కారు బోల్తాపడిన ఘటనలో ఒకరు మృతిచెందగా.. ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఎస్‌ఐ సతీష్‌ తెలిపిన వివరాల ప్రకారం దేవరకద్ర మండలానికి చెందిన దుబ్బల శ్రీధర్‌, భూత్పూర్‌కు చెందిన హర్షవర్ధన్‌రెడ్డి, తుమ్మల రాఘవేందర్‌, దుబ్బల హరిప్రసాద్‌ కారులో దేవరకద్ర నుంచి సోమశిలకు బయలుదేరారు. మార్గమధ్యలో మండలంలోని వావిళ్లబావి గ్రామం వద్ద కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టింది. కారులో ఉన్న నలుగురికి తీవ్రగాయాలు కాగా వారిని 108 అంబులెన్స్‌లో నాగర్‌కర్నూల్‌ జిల్లా ఆస్పత్రికి తరలించారు. దుబ్బల శ్రీధర్‌(23) పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమాధ్యలో మృతిచెందినట్లు ఎస్‌ఐ తెలిపారు.

మహిళపై వేధింపులు: వ్యక్తిపై కేసు నమోదు

నవాబుపేట: మహిళను వేధించిన ఘటనలో వ్యక్తిపై కేసు నమోదు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నవాబుపేట మండల కేంద్రానికి చెందిన వివాహిత జిల్లా కేంద్రంలో కూలీ పనికి వెళ్తున్న తరుణంలో టీడీగుట్ట అడ్డాలో ఉన్న మేసీ్త్ర సురేందర్‌ ఆమైపె లైంగిక వేధింపులకు దిగాడు. దీంతో మహిళ కూలికి వెళ్లటం మానేసింది. కాగా సురేందర్‌ బుధవారం మండల కేంద్రానికి వచ్చి సదరు వివాహిత ఇంట్లో ఒంటరిగా ఉండగా ఆమెను చంపుతానంటూ భయబ్రాంతులకు గురిచేసి బలవంతంగా కారులో ఎక్కించుకుని జిల్లా కేంద్రం వైపు తీసుకెళ్లాడు. దీంతో ఆమె కేకలు వేయటంతో.. మండల కేంద్రం నుంచి యన్మన్‌గండ్ల సమీపంలో ఆమెను వదిలేసి పరారయ్యాడు. అనంతరం బాధితురాలు తన భర్త మైబుతో కలిసి బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. మేసీ్త్ర సురేందర్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ విక్రమ్‌ తెలిపారు.

అనుమానాస్పదంగా

వ్యక్తి మృతి

అడ్డాకుల: మూసాపేట మండలం జానంపేటలో బుధవారం అదే గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీ పొలంలో అనుమానాస్పదంగా మృతిచెందాడు. బాధితులు, పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన సల్ల పెద్దయాదయ్య(50) వ్యవసాయ కూలీ పనులు చేస్తూ జీవిస్తున్నాడు. బుధవారం ఉదయం ఇంటి వద్ద టిఫిన్‌ చేసి అచ్యుతారెడ్డి వ్యవసాయ పొలంలో కూలీ పనులకు వెళ్లాడు. అక్కడ కరెంటు మోటారు సమీపంలో పొలం పనులు చేస్తూ మృతిచెందాడు. సాయంత్రం పొలానికి సమీపంలో గొర్రెలను మేపుతున్న కాపరి పొలంలో యాదయ్య మృతి చెంది ఉండడాన్ని గమనించి వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశాడు. కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుని బోరున విలపించారు. యాదయ్య కాలుకు కరెంట్‌ షాక్‌ తగిలినట్లు బొబ్బలు ఉండడంతో కరెంట్‌ షాక్‌తోనే మృతి చెంది ఉంటాడని తెలిపారు. కరెంటు మోటారు సమీపంలోని తీగలు తగిలి మృతిచెందినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న హెడ్‌ కానిస్టేబుల్‌ శివారెడ్డి ఘటనా స్థలానికి వెళ్లి విచారించారు. మృతుడికి భార్య పెద్ద వెంకటమ్మ, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రికి తరలించారు. యాదయ్య కరెంటు షాక్‌తో మృతి చెందినట్లు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ వేణు తెలిపారు.

ఉల్లిధర గరిష్టంగా

రూ.2 వేలు

దేవరకద్ర: దేవరకద్ర మార్కెట్‌ యార్డులో బుధవారం ఉల్లి ధరలు నిలకడగా ఉన్నాయి. గతవారం వచ్చిన ధరలే ఈ వారం నమోదయ్యాయి. సీజన్‌ తగ్గడంతో మార్కెట్‌కు వచ్చిన వేయి బస్తాల ఉల్లిని కొనడానికి వ్యాపారులు పోటీ పడ్డారు. క్వింటాల్‌ ఉల్లి గరిష్టంగా రూ.2 వేలు పలుకగా కనిష్టంగా రూ.1400 ధర వచ్చింది. 50 కేజీల ఉల్లి బస్తాను గరిష్ట ధర రూ.1000, కనిష్ట ధర రూ.700 వరకు విక్రయించారు. ఎక్కువగా చిరు వ్యాపారులు, వినియోగదారులు ఉల్లిని కొనుగోలు చేశారు.

రోడ్డు ప్రమాదంలో  యువకుడు దుర్మరణం 
1
1/1

రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement