జిల్లాకే ‘ఆదర్శం’ వెన్నాచేడ్‌ స్కూల్‌ | - | Sakshi
Sakshi News home page

జిల్లాకే ‘ఆదర్శం’ వెన్నాచేడ్‌ స్కూల్‌

Jun 12 2025 3:27 AM | Updated on Jun 12 2025 3:27 AM

జిల్ల

జిల్లాకే ‘ఆదర్శం’ వెన్నాచేడ్‌ స్కూల్‌

గండేడ్‌: పేరులోనే కాదు ఫలితాల్లో కూడా ఆదర్శంగా నిలుస్తోంది జిల్లాలో ఏకై న ఆదర్శ పాఠశాల (మోడల్‌ స్కూల్‌). మారుమూల గ్రామంలో ఉన్నప్పటికీ ఈ పాఠశాలలో చేర్పించేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారు. గండేడ్‌ మండలం వెన్నాచేడ్‌లో ఉన్న ఈ పాఠశాలను 2013లో అప్పటి హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. మోడల్‌ మంజూరైనప్పటికీ ప్రభుత్వ భూమి లేకపోవడంతో వెన్నాచేడ్‌లో పూర్వవిద్యార్థుల సమ్మేళనం ద్వారా వచ్చిన డబ్బు, గ్రామస్తుల సహకారంతో ఐదు ఎకరాల భూమిని సమకూర్చి.. పక్కా భనన నిర్మాణం చేపట్టారు. ప్రస్తుతం ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ వరకు బోధన సాగుతోంది. 2016లో పదో తరగతి మొదటి బ్యాచ్‌ పదో తరగతి పరీక్షలు రాశారు. 64 మంది పరీక్ష రాయగా.. వందశాతం ఉత్తీర్ణత సాధించారు. 2017లో 93 శాతం 2019లో 98 శాతం ఉత్తీర్ణత సాధించింది. మిగతా అన్ని విద్యా సంవత్సరాల్లో 2025 వరకు వందశాతం ఉత్తీర్ణత సాధించడం విశేషం. ఈ ఏడాది 91 మంది పదోతరగతి పరీక్షలు రాయగా.. అందరూ ఉత్తీర్ణులయ్యారు. ఇంటర్మీడియట్‌లోనూ మంచి ఫలితాలు సాధిస్తున్నారు. ప్రస్తుతం పాఠశాలలో 483 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇంటర్‌లో 110 మంది ఉన్నారు.

ప్రతి ఏటా వందశాతం ఉత్తీర్ణత

జిల్లాకే ‘ఆదర్శం’ వెన్నాచేడ్‌ స్కూల్‌ 1
1/1

జిల్లాకే ‘ఆదర్శం’ వెన్నాచేడ్‌ స్కూల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement