జీవన ఎరువులతో ఉపయోగాలెన్నో | - | Sakshi
Sakshi News home page

జీవన ఎరువులతో ఉపయోగాలెన్నో

Jun 2 2025 12:41 AM | Updated on Jun 2 2025 12:41 AM

జీవన ఎరువులతో ఉపయోగాలెన్నో

జీవన ఎరువులతో ఉపయోగాలెన్నో

అలంపూర్‌: పంటల సాగులో జీవన ఎరువులతో అనేక ఉపయోగాలు ఉన్నాయని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సక్రియ నాయక్‌ పేర్కొంటున్నారు. జీవన ఎరువులు ముఖ్యంగా వాతావరణంలోని నత్రజనిని స్థిరీకరిస్తాయి. నేలలోని భాస్వరాన్ని అందుబాటులోకి తెస్తాయి. ఇప్పటి వరకు జీవన ఎరువుల్లో స్థూలంగా రెండు తరగతులు అందుబాటులో ఉన్నాయి. అవి 1. నత్రజని స్థిరీకరించేవి (నైట్రోజన్‌ ఫిక్సర్‌) 2. భాస్వరాన్ని అందుబాటులోకి తెచ్చేవి.

జీవన ఎరువుల ఉపయోగాలను పరిశీలిస్తే

● హర్మోన్లు, విటమిన్లు, ఎంజైములు లభ్యమై మొక్క పెరుగుదల చురుకుగా ఉంటుంది.

● అలాగే దిగుబడులు 10 నుంచి 20 శాతం వరకు పెరుగుతాయి. దీంతో 20 నుంచి 25 శాతం నత్రజని, భాస్వర ఎరువుల వాడకాన్ని తగ్గించవచ్చును.

● నేల నుంచి సంక్రమించే కొన్ని తెగుళ్ల నుంచి

పంటను కొంత వరకు కాపాడవచ్చు.

● ఉపయోగకరమైన సూక్ష్మజీవులు కూడా

గణనీయంగా పెరుగుతాయి.

● నేల భౌతిక లక్షణాలు మేరుగుపడతాయి.

వేర్లకు గాలి, నీరు బాగా లభ్యమవుతాయి.

● భూసారం, ఫలదత పెరుగుతాయి.

● వృక్ష సంబంధిత భాగాల నాణ్యత రుచి

పెరుగుతాయి.

● పశువుల మేతలో పోషకాల పరిమాణం పెరుగుతుంది.

● రైతులకు ఎరువుల ఖర్చు తగ్గుతుంది. జీవన ఎరువుల ధర కంటే లాభాల నిష్పత్తి అధికంగా

ఉంటుంది.

● ఎరువుల దిగుమతికి అయ్యే ఖర్చు కూడా ఆదా అవుతుంది.

● పరిసరాల అనుకూలత వాతావరణ మిత్రత్వం కలిగి ఉంటాయి.

● జీవన ఎరువులు ఎంతగా ఉపయోగించుకుంటే అంతగా వృద్ధి చెందుతాయి.

● కాలుష్యం తగ్గుతుంది. నేలకు, పంటకు ఎ లాంటి హాని జరగదు.

● నత్రజని భాస్వర జీవన ఎరువులు రెండు వాడినప్పుడు అధిక ప్రయోజనం ఉంటుంది.

జీవన ఎరువుల వాడకంలో ఈ

జాగ్రత్తలు తప్పనిసరి

● జీవన ఎరువులను వేడి, వెలుతురు తగిలే ప్రదేశాల్లో ఉంచకూడదు. చల్లని ప్రదేశాల్లో నిల్వ ఉంచాలి.

● జీవన ఎరువులను పురుగుల మందులతో, రసాయన ఎరువులతో కలిపి వాడరాదు.

● విత్తనశుద్ధి చేసేటప్పుడు మొదటగా విత్తనాలను శిలీంధ్ర నాశనులతో శుద్ధి చేసి 24 గంటల తర్వాత జీవన ఎరువులను పట్టించాలి.

● ప్యాకెట్లపై సూచించిన గడువు తేదీ (షెల్ఫ్‌ పీరియడ్‌) గమనించాలి. గడువు దాటిన ఎరువులను వాడకపోవడం మంచిది.

● జీవన ఎరువులను ప్రభుత్వ రంగ సంస్థల నుంచి నమ్మకమైన సంస్థల నుంచి మాత్రమే కొనుగోలు చేయాలి.

● పైరుకు నిర్దేశించబడిన ఎరువులను

మాత్రమే వాడాలి.

జీవన ఎరువుల ఎంపిక ఇలా..

పప్పు జాతికి (చిక్కుడు జాతి) పైర్లకు.. రైజోబియం స్పీషీస్‌

వరి .. నీలి ఆకుపచ్చ నాచు, అజొల్లా, అజొస్పైరిల్లం లిపోపేరమ్‌

పత్తి, చిరుధాన్యాలు, ఉద్యాన పంటలు.. అజోస్పైరిల్లం బ్రాసిలెన్స్‌

చెరుకు.. అజోటోబ్యాక్టరు, అసిటొబాక్టరు, అజోస్పైరిల్లం, భాస్వర జీవన ఎరువులు

అన్ని పంటలకు, అన్ని నేలలకు ఫాస్పో బాక్టీరియా, మైకో రైజా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement