
తాగునీరు కలుషితం..
తాగునీటి పాత పైప్లైన్ స్థానంలో కొత్త పైపులైన్ నిర్మాణానికి ఎప్పుడు మోక్షం లభిస్తుందోనని ఆయా గ్రామాల ప్రజలు చర్చించుకుంటున్నారు. ఎన్నో ఏళ్ల నాటి పాత పైప్లైన్ ద్వారా తాగునీరు సరఫరా చేస్తుండటం.. తరచూగా లీకేజీలు ఏర్పడుతుండటంతో చెత్తాచెదారం, నాసుతో కూడిన నీరు సరఫరా అవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాగునీటి సమస్యను తాగునీటి సమస్యను సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ఇప్పటికై నా పాలకులు, అధికారులు స్పందించి తాగునీటి సమస్య పరిష్కారం కోసం కొత్త పైప్లైన్ నిర్మించాలని కోరుతున్నారు.