
రమాదేవికి జీవ వైవిధ్య పరిరక్షణ అవార్డు
జడ్చర్ల టౌన్: బాదేపల్లి పట్టణానికి చెందిన పరిశోధక విద్యార్థి రమాదేవికి జీవ వైవిధ్య పరిరక్షణ అవార్డు దక్కింది. జీవ వైవిధ్య మండలి చరిత్రలో అవార్డు పొందిన తొలి మహిళగా రికార్డును సొంతం చేసుకున్నారు ఆమె. అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం హైదరాబాద్‌లోని బిర్లా మ్యూజియం భాస్కర్ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర జీవ వైవిధ్య మండలి రమాదేవికి అవార్డును బహుకరించింది. స్థానిక ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ, పీజీ పూర్తిచేసిన రమాదేవి.. అధ్యాపకుడు డా.సదాశివయ్య పర్యవేక్షణలో పరిశోధన లు ప్రారంభించారు. బొటానికల్ గార్డెన్‌లో అనేక రకా ల మొక్కలు నాటడంతో పాటు అడవుల్లో పరిశోధనలు చేయడంతో పాటు సర్ప రక్షణలోనూ ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. దీంతో రాష్ట్ర జీవ వైవిధ్య మండలి అవార్డును రాష్ట్ర అటవీశాఖ ముఖ్య కార్యదర్శి డా.సువర్ణ, జీవ వైవిధ్య మండలి ప్రధాన కార్యదర్శి కాళీచరణ్ ప్రదానం చేశారు. రమాదేవికి అవార్డు దక్కడంపై బొటానికల్ గార్డెన్ సమన్వయకర్త సదాశివయ్య అభినందనలు తెలిపారు.