
గ్యాస్ లీకేజీతో అగ్నిప్రమాదం
మహబూబ్‌నగర్ క్రైం: గ్యాస్ సిలిండర్ లీకేజీ కారణంగా మంటలు చెలరేగి ఓ మెస్‌తో పాటు కిరాణ దుకాణం దగ్దమైంది. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో గురువారం చోటు చేసుకుంది. అగ్నిమాపకశాఖ అధికారి మల్లికార్జున్ కథనం ప్రకారం.. జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్డులో ఉన్న ఓ మెస్‌లో ఉదయం 11:30 ప్రాంతంలో భోజనం తయారు చేస్తున్న క్రమంలో సిలిండర్ రెగ్యులేటర్ నుంచి గ్యాస్ లీకేజీ కావడంతో మంటలు చెలరేగాయి. మెస్‌లో నుంచి పక్కనే ఉన్న కిరాణ దుకాణంలోకి మంటలు వ్యాపించడంతో కిరాణ వస్తువులన్నీ దగ్ధమయ్యాయి. సమచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదంలో దాదాపు రూ. 5లక్షల నష్టం వాటిల్లినట్లు అంచనా వేసినట్లు ఫైర్ ఆఫీసర్ వెల్లడించారు.