కొత్తపల్లి: అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పట్టుకున్నట్లు మద్దూర్ ఎస్‌ఐ విజయ్‌కుమార్ తెలిపారు. వివరాలు.. కర్ణాటక రాష్ట్రం గుర్మిట్‌కాల్‌కు బొలెరోలో తరిలిస్తున్నట్లు సమాచారం అందింది. సోమవారం తెల్లవారుజామున కొత్తపల్లి మండలం భూనీడు గ్రామ శివారులో వాహనంలో బియ్యాన్ని గుర్తించి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈవిషయమై కోస్గి ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులకు సమాచారమివ్వగా పట్టుబడిన బియ్యాన్ని పంచనామా నిర్వహించారు. వాహనంలో 57బస్తాలు 28 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని సీజ్ చేశారు. వాహనాన్ని పోలీసులకు అప్పగించి డ్రైవర్ పరశురాం, యజమానికి శ్రీనివాస్‌ఐ కేసు నమోదుచేశారు. ఈ బియ్యం దేవరకద్ర మండలం పూసలపహాడ్ నుంచి కర్ణాటకకు తరలిస్తున్నట్లు ఎస్‌ఐ విజయ్‌కుమార్ తెలిపారు.