కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి 1967 ఎన్నికల్లో బి.నర్సింహారెడ్డి, 1972 ఎన్నికల్లో కె.రంగదాసు స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగి గెలిచారు. ఇదే నియోజకవర్గం నుంచి 1999లో కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించిన జూపల్లి కృష్ణారావు.. 2004 ఎన్నికల్లో పోటీకి సిద్ధమయ్యారు. ఇంతలోనే టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పొత్తులో భాగంగా టీఆర్‌ఎస్‌కు చెందిన నిరంజన్‌రెడ్డికి టికెట్ దక్కింది. దీంతో జూపల్లి కృష్ణారావు స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచి విమానం గుర్తుపై విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో ఆయన ప్రత్యర్థి నిరంజన్‌రెడ్డికి డిపాజిట్ కూడా దక్కకపోవడం గమనార్హం. ఆ తర్వాత జూపల్లి 2009లో మళ్లీ కాంగ్రెస్ నుంచి, 2012, 2014 ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థిగా గెలిచారు. 2018లో ఓటమిపాలయ్యారు.
● 1952లో నాగర్‌కర్నూల్ ద్విసభ్య నియోజకవర్గంగా ఉన్నప్పుడు బ్రహ్మారెడ్డి, రామస్వామి ఇద్దరూ ఇండిపెండెంట్లుగానే గెలుపొందారు. ఆ తర్వాత 1867 ఎన్నికల్లో వీఎన్ గౌడ్ ఇండిపెండెంట్‌గా బరిలో నిలిచి విజయం సాధించారు. అనంతరం ఆయన 1972, 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీచేసి గెలిచారు. కాగా.. నాగం జనార్దన్‌రెడ్డి 2009 ఎన్నికల్లో గెలిచాక తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో రాజీనా మా చేయడంతో 2012లో ఉప ఎన్నిక వచ్చింది. ఈ ఎన్నికల్లో నాగం స్వతంత్ర అభ్యర్థిగా పో టీ చేసి విజయం సాధించారు. అప్పట్లో నాగం తరఫున ప్రచారానికి కేసీఆర్ రావడం విశేషం.
● జడ్చర్ల నియోజకవర్గానికి 1962, 1967లో కొత్త కేశవులు, లక్ష్మీనర్సింహారెడ్డి స్వతంత్ర అభ్యర్థులుగా నిలబడి గెలిచారు. ఆ తరువాత మరెవరు స్వతంత్రులకు ఇక్కడ విజయం దక్కలేదు. 1957లో మక్తల్ నియోజకవర్గ ద్విసభ్య స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఒక రు కాంగ్రెస్ నుంచి గెలుపొందగా.. ఇండిపెండెంట్‌గా బన్నప్ప బరిలో నిలిచి విజయం సాధించారు.
● మహబూబ్‌నగర్ స్థానానికి 1962లో జరిగిన ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి ఎం.రాంరెడ్డి 3,634 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇక 2004 ఎన్నికల్లో పులివీరన్న 19,282 ఓట్ల మెజార్టీతో, 2009లో రాజేశ్వర్‌రెడ్డి 5,275 ఓట్ల మెజార్టీతో స్వతంత్ర అభ్యర్థులుగానే గెలిచారు.
● గద్వాల నియోజకవర్గానికి 1957లో జరిగిన ఎన్నికల్లో ఇండిపెండెంట్ డీకే సత్యారెడ్డి గెలుపొందారు. ఆ తర్వాత 1978 ఎన్నికల్లో ఆయన జనతాపార్టీ తరఫున విజయం సాధించారు. ఇక సత్యారెడ్డి కుమారుడు డీకే భరతసింహారెడ్డి 1994 ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీచేసి గెలిచారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన ఆయన ప్రత్యర్థి సమరసింహారెడ్డి సొంత సోదరుడే కావడం విశేషం. 1967లోనూ ఇక్కడి నుంచి ఉప్పల గోపాల్‌రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు.
● కల్వకుర్తి నియోజకవర్గం నుంచి 1962లో వెంకట్‌రెడ్డి, 1967లో ద్యాప గోపాల్‌రెడ్డి స్వతంత్ర అభ్యర్థులుగా గెలిచారు. ఆ తర్వాత 1994లో ఎడ్మ కిష్టారెడ్డి సైతం ఇండిపెండెంట్‌గా విజయం సాధించారు.