టీచర్‌ పోస్టులు పెంచాల్సిందే.. | - | Sakshi
Sakshi News home page

టీచర్‌ పోస్టులు పెంచాల్సిందే..

Sep 22 2023 1:16 AM | Updated on Sep 22 2023 1:16 AM

తెలంగాణ చౌరస్తాలోఫ్లకార్డులు ప్రదర్శిస్తున్నటీఆర్టీ అభ్యర్థులు  - Sakshi

తెలంగాణ చౌరస్తాలోఫ్లకార్డులు ప్రదర్శిస్తున్నటీఆర్టీ అభ్యర్థులు

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: డీఎస్సీ నోటిఫికేషన్‌ కోసం ఏళ్ల తరబడి నిరుద్యోగులు ఎదురుచూస్తుండగా.. ఎట్టకేలకు ప్రభుత్వం టీఆర్‌టీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. కానీ.. ఆ ఆనందం నిరుద్యోగుల్లో ఎక్కువ సేపు నిలవలేదు. వేలల్లో అభ్యర్థులు ఉండగా.. ప్రభుత్వం మాత్రం చాలా తక్కువ సంఖ్యలో పోస్టుల భర్తీకి అనుమతి ఇవ్వడమే ఇందుకు కారణం. దీంతో పోస్టులు పెంచాలని.. అలాగే, టీఆర్టీ దరఖాస్తు ఫీజును తగ్గించాలని ఆందోళన బాట పట్టారు. గురువారం మహబూబ్‌నగర్‌లో అభ్యర్థులు నిరసన ర్యాలీ చేపట్టారు. ఇదిలా ఉంగా, టీఆర్టీ నోటిఫికేషన్‌ విడుదల చేసిన నేపథ్యంలో ఈనెల 20 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. పోస్టుల భర్తీలో భాగంగా ఈనెల 15న టెట్‌ను నిర్వహించారు. అలాగే, టీఆర్టీ కోసం దరఖాస్తు తేదీ నుంచి 60 రోజుల్లో అంటే నవంబర్‌ 20వ తేదీ ఆ మధ్యలో పరీక్షలు సైతం నిర్వహించనున్నారు.

13వేల పోస్టులతో మెగా డీఎస్సీ వేయాలి

ఉమ్మడి జిల్లాలో పోస్టులు 586 ఉండి జిల్లాల వారీగా తక్కువ పోస్టులు ఉన్నాయి. పోస్టులు సబ్జెక్టులు, కేటగిరీలు, కేడర్‌ల వారీగా చూస్తే ఒక్కో పోస్టు కూడా ఉండడం లేదని పలువురు అభ్యర్థులు పేర్కొంటున్నారు. రిజర్వేషన్‌ టేబుల్‌లో పోస్టుల సంఖ్య కంటే సున్నాలే ఎక్కువగా ఉన్నాయన్నారు. ఎన్నో ఏళ్లుగా డీఎస్సీ వేస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటి నుంచి అన్ని వదులుకుని టీఆర్టీకి సిద్ధమవుతున్నామని, కానీ ప్రభుత్వం చాలీచాలని పోస్టులు ఇవ్వడం వల్ల తీవ్ర అన్యాయం జరుగుతుందని వెంటనే పోస్టులు పెంచాలన్నారు. అసెంబ్లీలో ప్రకటించిన విధంగా 13వేలకు పైగా పోస్టులతో మెగా డీఎస్సీ వేయాలని డిమాండ్‌ చేశారు. వీటితో పాటు ఏ పరీక్షకు లేని విధంగా ఫీజులు ఏకంగా రూ.వెయ్యి పెట్టారని, నిరుద్యోగులు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నారని ఫీజులు వెంటనే రూ.200లకు తగ్గించాలని డిమాండ్‌ చేశారు.

నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం

మహబూబ్‌నగర్‌లో 415 పోస్టులు, నాగర్‌కర్నూల్‌లో 450, నారాయణపేటలో అత్యధికంగా 470 పోస్టులు ఉన్నాయి. ఇక గద్వాల, వనపర్తిలో 316 పోస్టుల చొప్పున ఖాళీలు ఉన్నాయి. ఇలా వీటిలో 30శాతం పోస్టులు ప్రమోషన్‌లకు వదిలేసినా.. ఉమ్మడి జిల్లాలో దాదాపు 1400 పోస్టులు నేరుగా భర్తీ చేయాల్సి ఉంటుంది. కానీ ప్రభుత్వం పోస్టులను భర్తీ చేయడమే తక్కువ భర్తీ చేస్తున్నట్లు పలువురు అభ్యర్థులు పేర్కొంటున్నారు. చాలా మంది అభ్యర్థులు గత సంవత్సరం నుంచి డీఎస్సీ పడుతుందనే భావనలో ఉద్యోగాల కోసం సిద్ధం అవుతున్నారు. మధ్యలో గురుకుల పోస్టులు పడినప్పటికి అందులో దాదాపు 80శాతం పోస్టులు కేవలం మహిళలకే కేటాయిండంతో పురుష అభ్యర్థులు మాత్రం అన్ని ఆశలు డీఎస్సీ మీదనే పెట్టుకున్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ జరుగుతున్న నేపథ్యంలో ఎన్ని పోస్టులకు ప్రమోషన్లు ఇస్తున్నారనే అంశంపై ప్రభుత్వానికి స్పష్టత ఉంది. మిగిలిన పోస్టులను పెంచాలని అభ్యర్థులు డిమాండ్‌ చేస్తున్నారు.

తక్కువ పోస్టులు కేటాయించడంపైనిరుద్యోగుల్లో అసంతృప్తి

ఉమ్మడి జిల్లాలో కేవలం 586 పోస్టుల భర్తీకి అనుమతి

దరఖాస్తు ఫీజు తగ్గించాలని డిమాండ్‌

మహబూబ్‌నగర్‌లో అభ్యర్థుల ఆందోళన

మెట్టుగడ్డ వద్ద ర్యాలీగా వెళ్తున్న టీఆర్టీ అభ్యర్థులు 1
1/1

మెట్టుగడ్డ వద్ద ర్యాలీగా వెళ్తున్న టీఆర్టీ అభ్యర్థులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement