
సిబ్బందితో సమావేశమైన కేంద్రం బృందం సభ్యులు
గట్టు: స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం కేంద్ర బృందం (ఎన్‌కాస్) సభ్యులు డా. రిజికుమార్, జ్ఞానరంజన్‌కుమార్ సందర్శించారు. పీహెచ్‌సీతో పాటు ఆయా సబ్‌సెంటర్ల పరిధిలో రోగులకు అందిస్తున్న వైద్యసేవలు, ఆస్పత్రిలో అందుబాటులో ఉన్న మందులు, ఆస్పత్రి పరిసరాలను పరిశీలించారు. అనంతరం ఆస్పత్రి ఆవరణలో వైద్యసిబ్బందితో సమావేశమై ప్రసవాలు, స్వచ్ఛత, రోజువారీగా రోగులకు అందిస్తున్న వైద్యసేవల గురించి అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ప్రోగ్రామ్ అధికారి స్రవంతి, వైద్యాధికారులు హరీశ్, రాజు, ఎన్‌కాస్ టీం మేనేజర్ రాజ్‌కుమార్, సీహెచ్‌ఓ ఊస్సేని, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.