
పోలీసులు స్వాధీనం చేసుకున్న గంజాయి ప్యాకెట్లు
అడ్డాకుల: గుట్టుచప్పుడు కాకుండా గంజాయిని విక్రయిస్తున్న ఇద్దరిని పోలీసులు పట్టుకోవడం కలకలం రేపింది. ఇరువురి నుంచి సుమారు అరకిలో వరకు గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ఎస్‌ఐ మాధవరెడ్డి వివరాల ప్రకారం.. పంజాబ్ రాష్ట్రానికి చెందిన రవిసింగ్ వనపర్తి జిల్లా కొత్తకోటలో ఉంటూ హర్వేస్టర్ మెకానిక్‌గా పని చేస్తున్నాడు. ఇతడికి అడ్డాకులకు చెందిన మునగాల నరేష్‌తో పరిచయం ఏర్పడింది. ఇద్దరు కలిసి కొన్నాళ్ల నుంచి గుట్టుచప్పుడు కాకుండా అడ్డాకుల, కొత్తకోటలో గంజాయిని విక్రయిస్తున్నారు. పక్కా సమాచారం అందుకున్న సీఐ రామకృష్ణ.. ఎస్‌ఐ మాధవరెడ్డితో కలిసి గురువారం మండల కేంద్రం సమీపంలో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇద్దరిని ఠాణాకు తరలించారు. వారి నుంచి సుమారు 40 గంజాయి ప్యాకెట్లు లభించినట్లు ఎస్‌ఐ తెలిపారు. వాటిలో సుమారు అరకిలో వరకు గంజాయి ఉన్నట్లు చెప్పారు. దీన్ని విలువ రూ.25వేల వరకు ఉంటుందన్నారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా వీరిద్దరితోపాటు ఇంకా ఎవరెవరు ఇందులో ఉన్నారన్న దానిపై పోలీసులు విచారణ చేస్తున్నట్లు తెలిసింది.
అడ్డాకులలో ఇద్దరిని పట్టుకున్న పోలీసులు
అరకిలో గంజాయి స్వాధీనం