24 గంటలు.. 34 మోటార్లు.. 2 టీఎంసీలు
పాలమూరు ఎత్తిపోతలకు సంబంధించి పంప్ హౌస్‌ల్లోని పంపులు ఒక రోజు నడిస్తే రెండు టీఎంసీల నీటిని ఎత్తిపోస్తాయి.
నార్లాపూర్ నుంచి లక్ష్మీదేవిపల్లి వరకు 140 కిలోమీటర్ల దూరం వరకు నీటిని సముద్ర మట్టం 240 మీటర్ల నుంచి 670 మీటర్లకు నీటిని ఎత్తిపోయనున్నారు. ప్రస్తుతం నాలుగు రిజర్వాయర్ల వద్ద 34పంపులు ఏర్పాటు చేయనున్నారు. మొదటి ఫేజ్‌లో మాత్రం రెండు చొప్పున పూర్తి చేసి7 టీఎంసీల నీటిని తాగునీటి కోసంవినియోగించేలా ప్లాన్ చేశారు.
పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్‌తో ఉమ్మడి పాలమూరులోని 10 అసెంబ్లీ నియోజకవర్గాల (నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, కొడంగల్, నారాయణపేట, మక్తల్, దేవరకద్ర, జడ్చర్ల, కల్వకుర్తి, అచ్చంపేట, షాద్‌నగర్) పరిధిలోని 30 మండలాలకు సంబంధించి 463 గ్రామాల్లోని 4,99,663 ఎకరాలకు సాగునీరందనున్నట్లు అధికారులు చెబుతున్నారు.