
సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): పెద్ద లీడర్లమనే భావనను పక్కన పెట్టి పార్టీ కోసం కష్టపడి పనిచేయాలని రాష్ట్ర ఎకై ్సజ్, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో పార్టీ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ కూడా ఒక వార్డుకు ఇన్‌చార్జ్‌గా ఉంటూ పార్టీ పటిష్టత కోసం కృషిచేస్తున్నారన్నారు. సాధారణ కార్యకర్తగా ఇంటింటికి తిరిగి పార్టీ కోసం పనిచేయాలన్నారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీ నేతలంతా కలిసికట్టుగా ముందుకు సాగాలన్నారు. కష్టపడి పనిచేసే వారిని పార్టీ తప్పకుండా గుర్తిస్తుందన్నారు. పార్టీ కోసం ఏం చేస్తున్నామనేది ప్రతి కార్యకర్త గుర్తెరిగి ఉండాలన్నారు. తెలంగాణ ఉద్యమంలో తుపాకీకి ఎదురెళ్లి పోరాటం చేస్తేనే ఈ స్థాయికి వచ్చామన్నారు. అభివృద్ధికి నిర్వచనంగా పాలమూరును తీర్చిదిద్దామని చెప్పారు. వచ్చేనెల 7న మన్యంకొండ వద్ద శాంతానారాయణగౌడ్ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహించే ఉచిత సామూహిక వివాహాలకు అర్హులైన వారు తమ క్యాంపు కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో జెడ్పీచైర్‌పర్సన్ స్వర్ణసుధార్‌రెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, ముడా చైర్మన్ వెంకన్న, మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, మార్కెట్ కమిటీ చైర్మన్ రహమాన్, నాయకులు వెంకటయ్య, గణేష్, గిరిధర్‌రెడ్డి, కౌన్సిలర్లు కిషోర్, రవికిషన్, శివరాజు, వినోద్, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
ఆత్మీయ సమ్మేళనంలోమంత్రి శ్రీనివాస్‌గౌడ్