● ఎంపీ రఘునందన్‌రావు
మహబూబాబాద్ అర్బన్: హైదరాబాద్‌లో ఈ నెల 10న జరగనున్న ప్రధాని మోదీ మహాసభను విజయవంతం చేయాలని ఎంపీ రఘునందన్‌రావు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. మానుకోట రాళ్ల సాక్షిగా కాకతీయుల సామ్రాజ్యంపై రానున్న ఎన్నికల్లో కాషాయ జెండా ఎగురవేయడం ఖాయమన్నారు. దేశం, రాష్ట్రంలో అభివృద్ధి చేస్తుంది బీజేపీ ప్రభుత్వమైతే రాష్ట్రంలో ఉన్న మంత్రులు గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే రోడ్డుపై ఫొటోలకు ఫోజులు ఇస్తున్నారని, పైసల మంత్రి కమీషన్ మంత్రిగా మారుతున్నారన్నారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు వల్లభూ వెంకటేశ్వర్లు, రాష్ట్ర ఉపాధ్యక్షు డు కల్యాణ్‌నాయక్, మాజీ ఎంపీ సీతారాంనాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శులు గడ్డం అశోక్, చీకటి మహేష్, మదన్‌లాల్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్యామ్‌సందర్ శర్మ, వద్దిరాజు రామచందర్‌రావు, కొమురయ్య, సుధీర్‌రెడ్డి, హిందు భారతి, నర్సింహరెడ్డి, శ్రీదేవిబాలు, తదితరులు పాల్గొన్నారు.


