మరిపెడ: తండ్రీకొడుకుల మధ్య డబ్బుల విషయంలో జరిగిన గొడవలో కొడుకు తండ్రిపై చే యిచేసుకోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన మరిపెడ మున్సిపాలిటీలో మంగళవా రం రాత్రి చోటుచేసుకుంది. సీఐ పవన్‌కుమార్ తెలి పిన వివరాల ప్రకారం.. మరిపెడ మున్సిపాలిటీకి చెందిన మౌర్య టీల్‌సింగ్(85) కుమారు డు నిరంజన్ తన కుటుంబ సభ్యులతో కలిసి సూర్యాపేటలో నివాసం ఉంటున్నాడు. మంగళవారం మరిపెడకు వచ్చిన నిరంజన్ తనకు ఇవ్వాల్సిన రూ.8వేలు ఇవ్వాలని తండ్రి టీల్‌సింగ్‌ను నిలదీశాడు. దీంతో ఇద్దరి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ క్రమంలో తండ్రిపై కొడుకు చేయిచేసుకోవడంతో టీల్‌సింగ్ కుప్పకూలిపోయాడు. వెంటనే తండ్రిని తన కారులో ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడు. మృతుడి భార్య శారద ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
డబ్బుల విషయంలో తండ్రీకొడుకుల మధ్య వాగ్వాదం
కొడుకు చేయిచేసుకోవడంతో మృతి చెందిన తండ్రి
టీల్‌సింగ్ (ఫైల్)


